Corona vaccine: అమెరికాలో సీనియర్‌ సిటిజన్లకు బూస్టర్‌ డోస్‌
close
Updated : 25/09/2021 07:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona vaccine: అమెరికాలో సీనియర్‌ సిటిజన్లకు బూస్టర్‌ డోస్‌

వ్యాధి పీడితులకు కూడా..
సిఫార్సులు ఆమోదించిన సీడీసీ

వాషింగ్టన్‌: కొవిడ్‌-19 నియంత్రణకు చేపట్టిన వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో మరో నూతన అధ్యాయానికి అమెరికా శ్రీకారం చుడుతోంది. వయసు మీదపడిన సీనియర్‌ సిటిజన్లకు, పలు వ్యాధులతో బాధలు పడుతున్నవారికి బూస్టర్‌ డోస్‌ వేసేందుకు అమెరికాలోని వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రాల (సీడీసీ) విభాగం ఆమోదం తెలిపింది. ఈ మేరకు సలహాదారుల కమిటీ పదేపదే చేసిన సిఫార్సులకు ఆమోదం తెలుపుతూ సీడీసీ డైరెక్టర్‌ డాృృ రాషెల్‌ వాలెన్‌స్కీ గురువారం రాత్రి సంతకం చేశారు. కమిటీ సిఫార్సుల ప్రకారం.. 65 ఏళ్లు, ఆ పై వయసున్న సీనియర్‌ సిటిజన్లకు, నర్సింగ్‌ హోంలలో చికిత్స పొందుతున్నవారికి, 50 ఏళ్లు దాటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి బూస్టర్‌ డోస్‌ అందించాలి. ఫైజర్‌ రెండో టీకా తీసుకొని కనీసం ఆర్నెల్లు పూర్తయినవారికే ఈ అదనపు డోసు ఇవ్వాలని ప్రతిపాదించారు. దీనికి అదనంగా రాషెల్‌ వాలెన్‌స్కీ మరో సూచన కూడా జత చేశారు. కొవిడ్‌ సోకే అవకాశం ఎక్కువగా ఉన్న ఖైదీలు, షెల్టర్‌ హోంలలో ఉండే నిరాశ్రయులు, ఆరోగ్య కార్యకర్తలకు సైతం బూస్టర్‌ డోస్‌ ఇచ్చేలా సిఫార్సులు సవరించారు.

పూర్తిస్థాయి వ్యాక్సినేషన్‌ 55 శాతమే
అమెరికా జనాభాలో 55 శాతం (182 మిలియన్లు) మాత్రమే ఇప్పటికి పూర్తిస్థాయిలో రెండు డోసుల వ్యాక్సినేషన్‌ చేయించుకున్నారు. బ్రిటన్‌, ఇజ్రాయెల్‌ ఇప్పటికే తమ తమ దేశాల్లో ప్రజలకు మూడో ప్రయత్నంగా బూస్టర్‌ డోసు ఇస్తున్నాయి. ఈ వైఖరి వ్యాక్సినేషన్‌కు దూరంగా ఉన్న పేద దేశాల ప్రయోజనాలను దెబ్బతీస్తుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ తీవ్ర అభ్యంతరం తెలుపుతోంది. అమెరికాలో రెండు డోసుల పూర్తిస్థాయి వ్యాక్సినేషనే తమ తొలి ప్రాధాన్యమని వాలెన్‌స్కీ ప్రకటించారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని