పన్నెండేళ్లకే సినీ గాయని అయ్యింది!
close
Published : 09/05/2016 01:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పన్నెండేళ్లకే సినీ గాయని అయ్యింది!

పన్నెండేళ్లకే సినీ గాయని అయ్యింది!

ఓ అమ్మాయి పాట పాడి అందరి ప్రశంసలూ అందుకుంది. ఏ వేదికపైనో, పాఠశాల కార్యక్రమాల్లోనో కాదు, సినిమాలో. అవును! పన్నెండేళ్ల వయసు నుంచి ఇప్పటి వరకూ ఎన్నో సినిమాల్లో పాటలు పాడుతూ ప్రశంసలు అందుకుంటోంది యాదగిరి స్ఫూర్తి.

* ఈ మధ్యే పదోతరగతి పూర్తి చేసుకున్న స్ఫూర్తి, ఇప్పటి వరకు తెలుగుతో పాటు హిందీ, కన్నడ భాషల్లో 14 సినిమాల్లో 16కు పైగా పాటలు పాడింది.

* స్ఫూర్తి పాటల్లో కిక్‌2 సినిమాలోని ుతీస్‌మార్‌ఖాన్‌.. బరిలో షేర్‌ఖాన్‌..’, లోఫర్‌ సినిమాలోని నొక్కెయి.. దోచేయ్‌.. దాచేయ్‌..’ పాటలు అందరి ప్రశంసలు పొందాయి.

* చిన్న వయసు నుంచే పాశ్చాత్య సంగీతం (వెస్టర్న్‌ మ్యూజిక్‌) నేర్చుకుంటున్న స్ఫూర్తి మొదటిసారిగా తండ్రి జితేందర్‌ దర్శకత్వం వహించిన ుయమహోయమ’ సినిమాలో టాకీసు... టాకీసు’ అనే గీతాన్ని ఆలపించింది. దీంతో పెద్ద సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.

* హైదరాబాద్‌లో ఉంటున్న స్ఫూర్తి సొంతూరు ఖమ్మం జిల్లా మణుగూరు.

* ఎన్నో అవార్డులూ వచ్చాయి. ఇటీవల దుబాయిలో జరిగిన ుగామా అవార్డు’, 2015లో ుఆంధ్ర కళాసమితి’ తదితర అవార్డులను సొంతం చేసుకుంది. సినిమాల్లోనే కాక వేదికలపై వందలాది ప్రదర్శనలు ఇచ్చింది.

* శ్రేయా ఘోషల్‌ తన అభిమాన గాయకురాలు. గొప్ప గాయని అవ్వాలనేది తన లక్ష్యమని చెబుతోంది స్ఫూర్తి.

- వెంగళ భాస్కర్‌,
మణుగూరు, న్యూస్‌టుడే

Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని