గేరులో.. లోపమేంటి?
close
Published : 27/07/2018 01:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గేరులో.. లోపమేంటి?

మెకానిక్‌ గురూ
గేరులో..  లోపమేంటి?

నాది పల్సర్‌ ఎన్‌ఎస్‌ 160 బైక్‌. గేర్‌ మార్చినప్పుడు ఒక్కోసారి వెంటనే పడటం లేదు. దీంతో చాలా ఇబ్బంది అవుతోంది. మెకానిక్‌కి చూపిస్తే విప్పి మరమ్మతు చేసి ఆయిల్‌ వేసి ఇచ్చాడు. రెండ్రోజులయ్యాక సమస్య మళ్లీ మొదటికొచ్చింది. దీంతో చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాను.

- నవీన్‌కుమార్‌, కరీంనగర్‌

క్లచ్‌ కేబుల్‌, గేర్‌ షిఫ్టింగ్‌ లింక్‌ని ఒకసారి పరిశీలించండి. అవి చెడిపోయి ఉంటే వెంటనే మార్చాలి. దీంతో మీ సమస్య పరిష్కారం అవుతుంది.

కారు అద్దం పగిలితే ఐదువేలు పెట్టి మంచి బ్రాండ్‌ గ్లాస్‌ వేయించాను. తర్వాత ఒక షాపతను ఇదే అద్దాన్ని సగం ధరకే వేసేవాణ్ని అన్నాడు. ఇంకోచోట అయితే ఇంకా తక్కువ ధర చెప్పాడు. ఎందుకిలా? ఆటోమొబైల్‌ వాహనాలకు సంబంధించి అసలు, నకిలీ భాగాలను గుర్తించడం ఎలా?

- చంద్రశేఖర్‌, నిజామాబాద్‌

డీలర్లు, డిస్ట్రిబ్యూటర్ల దగ్గర మాత్రమే వాహనాల నాణ్యమైన విడిభాగాలు దొరుకుతాయి. మార్కెట్లో దొరికే ఇతర కొన్ని బ్రాండ్లు అచ్చంగా ఒరిజినల్‌ ఎక్విప్‌మెంట్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ (ఓఈఎం) విడిభాగాలను. పోలి ఉంటాయి. కొన్ని నాణ్యతలో బాగుంటే, ఇంకొన్ని నాసిరకంగా ఉంటాయి. ఏవి నకిలీవో, ఏవి అసలువో సాధారణ జనం తెలుసుకోవడం కష్టం. ధర తక్కువని వాటిని కొనొద్దు. నమ్మకమైన వ్యక్తులు, అనుభవజ్ఞులైన మెకానిక్‌లు మాత్రమే వీటిని గుర్తించగలరు.

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో నేను ఎల్‌పీజీ లేదా సీఎన్‌జీ ఆప్షన్‌ ఉన్న కారు కొనాలనుకుంటున్నాను. నా నిర్ణయం మంచిదేనా? ఆరు లక్షల బడ్జెట్‌లో దొరికే మంచి కారు సూచించండి.

- వెంకటేశ్వర్లు, ఖమ్మం

సీఎన్‌జీ వాహనం కాలుష్యరహితమైంది. అనుకూలమైంది. మైలేజీ కూడా బాగుంటుంది. అయితే ఈ గ్యాస్‌ నింపే స్టేషన్లు తక్కువ. మారుతీ సెలేరియో, ఆల్టో కే10, హ్యుందాయ్‌ ఇయాన్‌ సీఎన్‌జీ కారులో దేన్నైనా ఎంచుకోవచ్చు.

- సాయిభరత్‌ బొప్పరాజు, www.motofix.in

Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని