బెస్ట్‌ ఫ్రెండ్‌ మీరే కావాలి!
close
Published : 26/03/2021 00:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బెస్ట్‌ ఫ్రెండ్‌ మీరే కావాలి!

నిన్న మొన్నటి దాకా అమ్మా... అంటూ కొంగు పట్టుకుని తిరిగిన చిన్నారులు.. టీనేజ్‌లోకి అడుగు పెట్టగానే అన్నీ తమకే తెలుసనుకుంటారు. పెద్దల మాటల్ని పెడ చెవిన పెడతారు. అంత మాత్రాన వారిని దండించొద్దు. ఆత్మీయనేస్తంలా  వారిని అక్కున చేర్చుకుని సరైన దోవలో నడిపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.

వారు చెప్పేది వినండి... టీనేజ్‌లోకి అడుగుపెట్టిన తర్వాత పిల్లల ప్రపంచం మరింతగా పెద్దదవుతుంది. పరీక్షల నుంచి స్నేహితుల వరకు వారికి బోలెడు విషయాలుంటాయి. కౌమారంలోకి అడుగుపెట్టిన మీ బిడ్డ చెప్పే విషయాలను మనసు పెట్టి వినండి. తను మీతో మాట్లాడానికి అవకాశమివ్వండి. తనకు ప్రతి విషయంలో అండగా ఉంటానని భరోసా ఇవ్వండి.
ఫ్రెండ్‌లా మారండి... మీ పిల్లలను. పేరెంట్‌లా కాకుండా స్నేహితురాలిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అంతే తప్ప తన వల్ల ఏదో పొరపాటు జరిగిందని, తప్పంతా తనదే అని తిట్టడం లాంటివి చేయొద్దు. ఒక ఫ్రెండ్‌లా తన ఇబ్బందిని అర్థం చేసుకోండి. ఆ సమస్య నుంచి తను బయటపడేందుకు సాయం చేయండి.
అవసరంలో ఆప్తురాలిగా... మీ బిడ్డలు కౌమరంలోకి ప్రవేశించినా వారు మీకు ఎప్పటికీ చిన్నవారే. వారు చేసే చిన్న చిన్న పొరపాట్లు, తప్పులు మీకు తెలియకూడదనుకుంటారు. అంత మాత్రాన వారిని అలా వదిలేయొద్దు. అవసరమైనప్పుడు మీ చేయూతను అందించడానికి సిద్ధంగా ఉండండి. మీ సాయంకోరి వస్తే ‘ అప్పుడే చెప్పానా ఇలా జరుగుతుంది’ అని దెప్పి పొడుపు మాటలు వద్దు.
హద్దులూ.. స్వేచ్ఛ రెండూ... తల్లిగా మీ పిల్లలకు కొన్ని సరిహద్దులు పెట్టడం సబబే. అయితే వారికి కావాల్సినంత మేరకు స్వేచ్ఛనూ కూడా మీరే కల్పించాలి. వారి ఆలోచనలు, సంతోషం, బాధ... ఇలా ఏవైనా వారికి వారు మీకు చెప్పేలా మీరు ఉండాలే తప్ప ‘ఏం ఆలోచిస్తున్నావో చెప్పు’ అని పదే పదే వారిపై ఒత్తిడి తేవొద్దు.
కమ్యూనికేషన్‌ పెంచుకోండి... పిల్లలు తెలియని వేదనతో బాధపడుతుంటే మీతో ఏం చెప్పలేదని నిర్లక్ష్యంగా వదిలేయొద్దు. అలాగే కచ్చితంగా చెప్పాలంటూ బలవంతం చేయొద్దు. వారితో ఎక్కువ సేపు మాట్లాడండి. వారి మనసులో ఏముందో తెలుసుకోండి. వారికి వారే మీతో తమ బాధను చెప్పేలా ఓ స్నేహితురాలిగా మెలగండి.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని