30 లక్షలు దాటిన కరోనా మరణాలు! - global covid 19 deaths cross 3 million
close
Published : 17/04/2021 18:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

30 లక్షలు దాటిన కరోనా మరణాలు!

బాల్టిమోర్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ పట్టపగ్గాల్లేకుండా వ్యాప్తి చెందుతోంది. దాని బారిన పడి మరణించిన వారి సంఖ్య శనివారం నాటికి 30లక్షలు దాటింది. జాన్‌హాప్కిన్స్‌ వర్శిటీ విడుదల చేసిన గణాంకాల ద్వారా ఈ విషయం వెల్లడైంది. ‘ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 13.99కోట్ల కరోనా కేసులు నమోదు కాగా.. మహమ్మారి ధాటికి బలైన వారి సంఖ్య 30,00,225కు చేరింది. అంతేకాకుండా 7.97కోట్ల మంది కరోనా నుంచి కోలుకున్నారు. భారీగా కరోనా ప్రభావం పడిన దేశాల జాబితాలో అమెరికానే తొలి స్థానంలో ఉంది. రెండో స్థానంలో భారత్‌ కొనసాగుతోంది. అమెరికాలో ఇప్పటి వరకు అత్యధికంగా 3.15కోట్లకు పైగా కేసులు నమోదు కాగా..  5,66,224 మంది మరణించారు. భారత్‌లో 1.45కోట్లకు పైగా కేసులు నమోదయ్యాయి’ అని వర్శిటీ వెల్లడించింది. 

‘జనవరి, ఫిబ్రవరిలో కేసుల్లో కాస్త తగ్గుదలను చూశాం. కానీ గత కొన్ని వారాలుగా మళ్లీ కేసులు విచ్చలవిడిగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 78 కోట్ల మందికి టీకా డోసులు ఇచ్చినప్పటికీ.. ఆసియా, మధ్య ప్రాచ్యంలోని పలు దేశాల్లో కేసులు పెరుగుతూనే ఉన్నాయి’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ టెడ్రోస్‌ అధానోమ్‌ తెలిపారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని