PSPK28: బద్రి-నందా కాంబో రిపీట్‌ కానుందా? - harish shankar promises vintage pawan kalyan for pspk28
close
Updated : 28/06/2021 09:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

PSPK28: బద్రి-నందా కాంబో రిపీట్‌ కానుందా?

హరీశ్‌ వీడియో.. నెటిజన్లు ఏమంటున్నారంటే

హైదరాబాద్‌: ‘గబ్బర్‌సింగ్‌’తో సూపర్‌హిట్‌ కాంబోగా పేరు తెచ్చుకున్నారు పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌, డైనమిక్ డైరెక్టర్‌ హరీశ్‌ శంకర్‌. వీరిద్దరి కాంబోలో త్వరలో ఓ సరికొత్త చిత్రం పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. మైత్రిమూవీ మేకర్స్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. PSPK28వ చిత్రంగా రూపుదిద్దుకోనున్న ఈ సినిమాలో పవన్‌కల్యాణ్‌ని యంగ్‌, పవర్‌ఫుల్‌ ఒకప్పటి ఎనర్జిటిక్‌ లుక్‌లో హరీశ్‌ చూపించనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే హరీశ్‌ శంకర్‌ తాజాగా ‘బద్రి’ సినిమా నుంచి పవన్‌కల్యాణ్‌ పవర్‌ఫుల్‌ వీడియోని అభిమానులతో పంచుకున్నారు. ‘మరోసారి అదే ఎనర్జీని చూద్దాం’ అని హరీశ్‌ పేర్కొన్నారు.

కాగా, హరీశ్‌ శంకర్‌ షేర్‌ చేసిన వీడియోలో పవన్‌ నోటి నుంచి ఎక్కువగా నందా పేరు వినిపించింది. దీంతో నెటిజన్లు.. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నందాజీ అలియాస్‌ విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌ నటించే అవకాశం ఉండొచ్చని అనుకుంటున్నారు. దీంతో ‘బద్రి’, ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’, ‘వకీల్‌సాబ్‌’ తర్వాత ఆన్‌స్క్రీన్‌పై పవన కల్యాణ్‌-ప్రకాశ్‌రాజ్‌ల మధ్య జరిగే డైలాగ్‌ వార్‌ మరోసారి చూసే అవకాశం ఉండొచ్చని వాళ్లు మాట్లాడుకుంటున్నారు. మరోవైపు ఈ ఏడాదిలో విడుదలైన ‘వకీల్‌సాబ్‌’లోని కోర్టుసీన్‌లో పవన్‌కల్యాణ్‌ (సత్యదేవ్‌) - ప్రకాశ్‌రాజ్‌ల (నందాజీ) మధ్య వచ్చే వాదోపవాదాలు అందరితో ఈలలు వేయించాయి.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని