Pawan - Rana Movie: అభిమానులకు చిత్ర బృందం సర్‌ప్రైజ్‌ - here pawan kalyan and rana movie making glimpse
close
Updated : 27/07/2021 20:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Pawan - Rana Movie: అభిమానులకు చిత్ర బృందం సర్‌ప్రైజ్‌

హైదరాబాద్‌: పవన్‌కల్యాణ్‌-రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో ఓ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ చిత్రానికి సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందిస్తున్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూట్‌ తాజాగా తిరిగి పట్టాలెక్కింది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సినిమా సెట్స్‌లో జరుగుతున్న షూటింగ్‌ విశేషాలతో కూడిన ఓ వీడియోను పంచుకుంది. ఇందులో పవన్‌-రానాలపై యాక్షన్‌ సీక్వెన్స్‌ తెరకెక్కిస్తున్నట్లు వీడియోను చూస్తే అర్థమవుతోంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుగా వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

ఇక ఈ సినిమాలో పవన్‌కల్యాణ్‌ భీమ్లా నాయక్‌ అనే పోలీస్‌ పాత్రలో కనిపించనున్నారు. రానా పేరేంటో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే. మలయాళంలో సూపర్‌హిట్‌ విజయాన్ని అందుకున్న ‘అయ్యప్పనుమ్‌ కోషియం’ రీమేక్ ఈ సినిమా వస్తోన్న విషయం విదితమే. ఆద్యంతం అభిమానులను అలరించేలా ఉన్న ఈ వీడియోను మీరూ చూసేయండి.




మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని