ప్రేమలో ఉండటం ఇష్టమే...ఊర్వశి - i love being in love urvashi
close
Published : 12/02/2021 23:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రేమలో ఉండటం ఇష్టమే...ఊర్వశి

ఇంటర్నెట్‌డెస్క్‌: మన పురాణాల్లో అందగత్తెలైన రంభ, ఊర్వశి, మేనకల పేర్లు చెప్పుకుంటాం. ఇప్పుడు వీరిలో ఒకరి పేరు పెట్టుకున్న నటి ఊర్వశి రౌటెల. హిందీ, తెలుగు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఫిబ్రవరి 14న  ప్రపంచ వ్యాప్తంగా ప్రేమికుల దినోత్సవం జరుపుకోనున్నారు. తాజాగా ప్రేమికుల రోజు గురించి ప్రేమపై ఉన్న అభిప్రాయాలను ఊర్వశి  వెల్లడిస్తూ..‘‘మొదటి చూపులోనే ప్రేమ’ అనే భావనను నేను కచ్చితంగా నమ్ముతా. చాలామంది దీనిని పెద్దగా విశ్వసించనప్పటికీ, కానీ కొన్ని విషయాల్లో అది రుజువైంది. మొదటిసారిగా ఎవరూ ప్రేమ లోతుల్లోకి జారుకోరు. అది కచ్చితమైన ఆకర్షణలో మాత్రం పడతారు. చివరకు ఆకర్షణ తీవ్రమై ప్రేమగా మారుతుంది. అయితే ఇక్కడో మీకో విషయం చెప్పాలి.  ప్రేమలో పడటం చాలా సులభమే. కానీ ఆ ప్రేమలోనే ఉండిపోవడం చాలా కష్టం అని..’’ తెలిపింది.

తెలుగులో ‘బ్లాక్‌రోజ్‌’ అనే చిత్రంలో చేస్తుంది.  ప్రస్తుతం హిందీలో ఇన్‌స్పెక్టర్‌ అవినాష్‌ అనే చిత్రంలో పూర్ణిమా అవినాష్‌ పాత్రలో నటిస్తోంది. రణదీప్‌ హుడా కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రానికి నీరజ్‌ పాఠక్ దర్శకత్వం వహిస్తున్నారు.  ఊర్వశికి ఇన్‌స్టాగ్రామ్‌లో 34 మిలియన్ల  ఫాలోవర్లను కలిగి ఉంది. తన అభిమానుల కోసం తరచూ ఆసక్తికర ఫొటోలను పంచుకుంటుంది.

ఇదీ చదవండి

డ్యాన్స్‌తో ఫిదా చేస్తోన్న రష్మికమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని