‘కేజీఎఫ్‌’ దర్శకుడు కథ చెప్పేశాడా? - is prasanthe neel narrated story line to ntr
close
Published : 11/08/2020 13:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘కేజీఎఫ్‌’ దర్శకుడు కథ చెప్పేశాడా?

హైదరాబాద్‌: ‘కేజీఎఫ్‌’తో భారీ యాక్షన్‌ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. ప్రస్తుతం ‘కేజీఎఫ్‌’ రెండో భాగం తెరకెక్కిస్తున్న ప్రశాంత్‌... తర్వాతి సినిమా ప్రముఖ కథానాయకుడు ఎన్టీఆర్‌తో చేస్తాడని చాలా రోజులు నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర గాసిప్‌ బయటికొచ్చింది. సినిమా కథను ఎన్టీఆర్‌ ఇటీవల విన్నారట.

ఎన్టీఆర్‌ - ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌ సినిమా గురించి చాలా రోజులుగా వార్తలొస్తున్నాయి. ₹200 కోట్ల బడ్జెట్‌ అంటూ, పాన్‌ ఇండియా సినిమా అంటూ టాలీవుడ్‌లో రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా ఈ క్రేజీ సినిమా కథను ప్రశాంత్‌ నీల్‌.. ఎన్టీఆర్‌కు వినిపించాడట. అయితే అది పూర్తి కథ కాదని తెలుస్తోంది. దీనిపై మరోసారి ఇద్దరూ భేటీ అవుతారని భోగట్టా. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్తారు. 2022లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కావొచ్చని సమాచారం.  ఈ సినిమా కోసం ఎన్టీఆర్‌ పెద్ద మొత్తంలో డేట్స్‌ ఇస్తున్నాడనీ అంటున్నారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని