ఇది చాలా క్లిష్ట సమయం: దిశా  - it’s been a rough time for everyone: disha
close
Published : 28/05/2021 23:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇది చాలా క్లిష్ట సమయం: దిశా 

ఇంటర్నెట్‌ డెస్క్: ప్రస్తుతం దేశమంతా కరోనా రెండోదశతో ఎన్నో అవస్థలు పడుతోంది. దీని బారినపడి ఎందరో ప్రజలు, మరెన్నో కుటుంబాలు విలవిల్లాడుతున్నాయి. ఇప్పుడున్న కరోనా గత ఏడాదిలో వచ్చిన దానికంటే చాలా కఠినమైనది. ఇలాంటి తరుణంలో కరోనా సెకండ్‌వేవ్‌తో ప్రజలు పడుతున్న ఇబ్బందులు, దాని ప్రభావం గురించి బాలీవుడ్‌ నటి దిశా  స్పందిస్తూ ‘‘ఇది చాలా క్షిష్ట సమయం. ప్రస్తుతం ఎక్కడ చూసినా కొవిడ్‌ సంబంధించిన వార్తలే. ఉదయం లేచిన దగ్గర్నుంచి మనచుట్టూ ఉన్న వ్యక్తుల బాధలు చూడటం.. టీవీల్లో, వార్తా పత్రికల్లో ఎక్కడా చూసిన ఇవే వార్తలు వినడం.. చాలా బాధాకరం. మా కుటుంబం, బంధువులు, ఇంకా ఇతర ప్రాంతాల నుంచి కూడా కాల్స్ వస్తుంటాయి. ఇక మన స్నేహితుల నుంచి కూడా ఫోన్స్ వస్తున్నాయి, మన క్షేమసమాచారాల గురించి ఆరా తీయడానికి. ఈ రోజుల్లో మనం ఏం మాట్లాడినా, ప్రపంచంలో ఏం జరిగినా..అదంతా దీని చుట్టూరానే తిరుగుతోంది. ఇలాంటి సమయంలో మనం ఇతరులకు చేతనైన సాయం చేయాలి. అది చిన్నదా..పెద్దదా అనేది ముఖ్యం కాదు. మనం చేసే సాయం.. ఏ మూలకు సరిపోతుందని అనుకోవద్దు. ఒక్కొక్క నీటి బొట్టు కలిస్తే సముద్రమైనట్టు ఎవరికితోచిన విధంగా వారు తమవంతు సాయం చేస్తే కొంత వరకైనా సమస్య తీరుతుంది. కనుక ప్రజలంతా కలిసికట్టుగా సహాయం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. మనలో ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకాలు వేయించుకోవాలి. మనం మన పనులను సక్రమంగా చేసినట్లయితే కొన్నాళ్లకు మళ్లీ ఎప్పటిలా అందరం కలిసి నిశ్చింతగా ఉండొచ్చు’’ అని తెలిపింది. ఈ మధ్యే దిశా పటానీ నటించిన ‘రాధే:యువ‌ర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ చిత్రం విడుదలైంది. సల్మాన్‌ఖాన్‌ హీరోగా నటించిన ఈ సినిమాకి ప్రభుదేవా దర్శకత్వం వహించారు. దిశా తెలుగులో పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లోఫ‌ర్’ చిత్రంలో వరుణ్‌ తేజ్‌ సరసన నాయికగా నటించింది. ప్రస్తుతం హిందీలో ‘కెటినా’, మోహిత్‌ సూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఏక్‌ విలన్‌ రిటర్న్స్’ చిత్రాల్లో నటిస్తోంది. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని