దివాలాపై నోరు విప్పిన జాకీ ష్రాఫ్‌ - jackie shroff opens up on bankruptcy reveals tiger shroff bought back house he lost due to financial troubles
close
Published : 24/06/2021 00:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దివాలాపై నోరు విప్పిన జాకీ ష్రాఫ్‌

టైగర్‌ విషయంలో గర్వపడుతున్నా

ముంబయి: తన కుమారుడు, నటుడు టైగర్‌ ష్రాఫ్‌ విషయంలో తాను ఎంతో గర్వపడుతున్నానని బీటౌన్‌ ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్‌ అన్నారు. ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన తన కుటుంబసభ్యుల గురించి, గతంలో ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందుల గురించి స్పందించారు. కొన్నిసార్లు  అన్ని పనుల్లో విజయం సాధించడం సాధ్యం కాదని ఆయన అన్నారు. ఆర్థికంగా దివాలా తీసిన సమయంలో కుటుంబమంతా తనకెంతో మద్దతుగా నిలిచినట్లు ఆయన వివరించారు.

‘బిజినెస్‌ అన్నాక.. అన్నిసార్లూ విజయం వరించడం సాధ్యం కాదు. కొన్నిసార్లు మనం విజయం సాధించవచ్చు. మరికొన్నిసార్లు పరాజయం పొందవచ్చు. అదే క్రమంలో నేను కూడా ఒకానొక సమయంలో నా ఆస్తి పోగొట్టుకున్నాను. అప్పుల పాలయ్యాను. అవి తీర్చడానికి ఎంతో కష్టపడి పనిచేశాను. ఆర్థిక సమస్యల కారణంగా పోగొట్టుకున్న ఇంటిని మా కుమారుడు టైగర్‌ మళ్లీ కొనుగోలు చేశాడు. ఆ విషయం నాకెంతో ఆనందాన్నిచ్చింది. నేను ఎంతగానో గర్వంగా ఫీలయ్యాను. టైగర్‌ తిరిగి మా పాత ఇంటిని కొనుగోలు చేయాలనుకున్నప్పుడు.. ‘పోయిందేదో పోయింది. వదిలేసేయండి’ అని నా భార్య చెప్పింది. కానీ టైగర్‌ వినకుండా.. తన కుటుంబానికంటూ ఓ ఇల్లు ఉండాలని భావించి.. దానిని తిరిగి కొనుగోలు చేశాడు’ అని జాకీ తెలిపారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని