Cricket News: భారతీయులపై ఎగతాళిగా మోర్గాన్‌, బట్లర్‌ ట్వీట్లు! - jos buttler and eoin morgans tweets mocking indians emerge
close
Updated : 09/06/2021 15:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cricket News: భారతీయులపై ఎగతాళిగా మోర్గాన్‌, బట్లర్‌ ట్వీట్లు!

దర్యాప్తు చేపట్టిన ఈసీబీ?

ఇంటర్నెట్‌ డెస్క్‌: జాతి విద్వేష వ్యాఖ్యల దుమారం ఇంగ్లాండ్‌ క్రికెట్‌ను ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు! ఇప్పటికే ఓలీ రాబిన్‌సన్‌ను ఈసీబీ అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి సస్పెండ్‌ చేసింది. విచారణకు ఆదేశించింది. మరో ఇద్దరు క్రికెటర్లు సైతం గతంలో ఆసియా వాసులు, ప్రత్యేకించి భారతీయులను కించపరుస్తూ, విద్వేష ట్వీట్లు చేసినట్టు వార్తలొచ్చాయి. ఆ ఇద్దరు ఇంగ్లాండ్‌ పరిమిత ఓవర్ల క్రికెట్‌ సారథి ఇయాన్‌ మోర్గాన్‌, విధ్వంసకర ఆటగాడు జోస్‌ బట్లర్‌ అని సమాచారం. వారు గతంలో చేసిన ట్వీట్లు ఇప్పుడు మీడియాలో ప్రసారం అవుతున్నాయి.

ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు ప్రస్తుతం బట్లర్‌, మోర్గాన్ ట్వీట్లపై దర్యాప్తు చేపట్టిందని సమాచారం. గతంలో వారు ‘సర్‌’ అనే ట్వీట్లతో భారతీయులను అనుకరిస్తూ, కించపరిచినట్టు తెలుస్తోంది. సాధారణంగా భారత్‌లో పై స్థాయిలో ఉన్నవారిని ‘సర్’ అని సంబోధిస్తూ గౌరవించడం అలవాటుగా మారింది. అంతేకాకుండా ఇంగ్లిష్‌ను కొద్దిగా అటు ఇటుగా మాట్లాడుతుంటారు. మోర్గాన్‌, బట్లర్‌, న్యూజిలాండ్‌ ఆటగాడు బ్రెండన్‌ మెక్‌కలమ్‌ సైతం ‘సర్‌’ అంటూ ఎగతాళిగా ట్వీట్లు చేసినట్టు కనిపిస్తోంది. అప్పుడప్పుడే క్రికెట్లో ఎదుగుతున్న భారతీయ క్రికెటర్లను అవమానించినట్టుగా వాక్యాలు ఉన్నాయి.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని