రెండో తనయుడి మురిపెం - kareena kapoor khan shares her baby photo
close
Published : 10/03/2021 13:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రెండో తనయుడి మురిపెం

తైమూర్‌ అలీఖాన్‌తో సందడిగా గడిపేస్తున్న సైఫ్‌ అలీఖాన్‌- కరీనా కపూర్‌ జీవితాల్లోకి మరో వారసుడు వచ్చిన విషయం తెలిసిందే. రెండో తనయుడు రాకతో సైఫ్‌ దంపతుల ఆనందానికి అవధుల్లేవు. కపూర్, ఖాన్‌ల కుటుంబమంతా సంబరాలు చేసుకున్నారు. తైమూర్‌ తమ్ముడు ఎలా ఉన్నాడో చుడాలని కరీనా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూశారు. కానీ ఎలాంటి ఫొటోలను కరీనా దంపతులు పంచుకోలేదు.

తైమూర్‌లా కాకుండా తమ రెండో కొడుకుని మీడియాకి దూరంగా ఉంచాలని సైఫ్‌ భావించినట్టు వార్తలు కూడా వచ్చాయి. దీంతో అభిమానులు నిరాశ చెందారు. మహిళా దినోత్సవం సందర్భంగా కరీనా తన రెండో కొడుకుతో ఉన్న ఫొటోని ఇన్‌స్టాలో పంచుకుంది.‘‘మహిళలకు సాధ్యం కానిది ఏదీ లేదు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు’’అంటూ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది కరీనా. ఫొటోలో పిల్లవాడి ముఖం కనబడక పోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని