ఎందుకు విఫలమయ్యానంటే: రాహుల్‌ - lack of game time is factor but you need to find a way out rahul
close
Published : 25/03/2021 18:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎందుకు విఫలమయ్యానంటే: రాహుల్‌

పుణె: మూడు నెలలు క్రికెటేమీ ఆడకపోవడం వల్లే ఇంగ్లాండ్‌తో టీ20 సిరీసులో విఫలమయ్యానని టీమ్‌ఇండియా ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ అంటున్నాడు. తన సన్నద్ధతపై విశ్వాసం వల్లే వన్డేలో పుంజుకోగలిగానని పేర్కొన్నాడు. రెండో వన్డేకు ముందు మీడియాతో మాట్లాడాడు.

‘నిరంతరం మ్యాచులు ఆడుతుంటే నా లయ బాగుంటుందని అనిపిస్తుంది. నాకు ఇష్టమైనంత గేమ్‌టైమ్‌ దొరక్కపోతే ఇబ్బంది పడతాను. నా మదిలో అదే ఉండిపోతుంది. అందుకే సన్నద్ధమయ్యేందుకు ఏదో ఒక దారి వెతకాలి. అది శిక్షణైనా కావొచ్చు ఓపెన్‌ నెట్‌ సెషన్‌ అయినా కావొచ్చు’ అని రాహుల్‌ అన్నాడు. ‘అందుకే నేను సన్నద్ధమయ్యేందుకు సాధ్యమైనంత ప్రయత్నిస్తాను. కానీ మ్యాచ్‌లు ఆడటానికి ఏదీ సాటి రాదు’ అని కేఎల్‌ పేర్కొన్నాడు.

రిషభ్‌ పంత్, ఇషాన్‌ కిషన్‌ వంటి వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మెన్‌ పోటీకి రావడంపై రాహుల్‌ స్పందించాడు. ‘భారత జట్టులో ఉన్నప్పుడు పోటీ ఎక్కువగా ఉంటుందని తెలుసు. ఏదో ఒక స్థానం మనకుంటుందని హాయిగా కూర్చోలేం. మనకెప్పుడూ సవాళ్లు ఎదురవుతాయి. మన దేశంలో ప్రతిభకు కొదవలేదు. అందుకే ముందుకెళ్లేందుకు మరింత శ్రమించాలి. ఆటను మెరుగుపర్చుకోవాలి. అవకాశం దొరికినప్పుడు రెండు చేతులతో అందిపుచ్చుకోవాలి’ అని రాహుల్‌ అన్నాడు.

అంతర్జాతీయ క్రికెట్లో ఫామ్‌ కోల్పోయి సతమతం అవ్వడం సాధారణమేనని కేఎల్‌ తెలిపాడు. ‘ఇదీ ప్రయాణంలో భాగమే. అందరికీ ఎదురవుతుంది. అందుకే మరీ ఆందోళన పడను. రిజర్వు బెంచీపై ఉన్నప్పుడు ఆటగాడిగా నిరాశ పడతాం. ఆ మూడు, నాలుగు నెలల తర్వాత జట్టులోని మిగతావాళ్లలా ఆడాలనుకుంటాం. అలా జరగకపోతే దానిని అంగీకరించాలి’ అని అతడు పేర్కొన్నాడు. మ్యాచ్‌కు సన్నద్ధత స్థాయికి తగినట్టు ఉందో లేదో ఎవరికి వారు ప్రశ్నించుకోవాలని రాహుల్‌ అంటున్నాడు. తాను అలాగే చేస్తానని వెల్లడించాడు. అలా ప్రశ్నించాక పరుగులు చేయకపోతే అంగీకరిస్తానని పేర్కొన్నాడు.

‘దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ బాగా ఆడకపోతే నిరాశపడతాం. బాగా ఆడి దేశానికి విజయాలు అందిస్తూనే ఉండాలి. అయితే ప్రతిసారీ ఆ పని చేయలేకపోవచ్చని అంగీకరించాలి. గత రెండున్నరేళ్లుగా నాకు అప్పజెప్పిన ప్రతి పాత్రను పోషించాను. జట్టును ముందుకు నడిపాను. అన్నీ సవ్యంగా సాగుతున్నప్పుడు నా ప్రక్రియ, అభిరుచి, అంకితభావాన్ని ప్రశ్నించుకోను. రెండు, మూడు చెత్త ప్రదర్శనలను అతిగా విశ్లేషించుకోను. అన్నీ మన నియంత్రణలో ఉండవని గుర్తుంచుకోవాలి’ అని రాహుల్‌ తెలిపాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని