‘భాగ్‌ కరోనా భాగ్‌’అంటూ దీపాలతో పరుగెత్తి! - locals in mp village run with torches to drive away virus with slogan of bhag corona bhag
close
Published : 22/04/2021 14:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘భాగ్‌ కరోనా భాగ్‌’అంటూ దీపాలతో పరుగెత్తి!

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ కోసం ఓ గ్రామస్థులు వినూత్న ప్రదర్శన చేపట్టారు. కాగడాల మాదిరి దీపాలు పట్టుకుని ‘భాగ్‌ కరోనా భాగ్‌’ అంటూ వీధుల్లో పరిగెత్తారు. ఈ ఘటన అగర్‌మల్వా జిల్లాలోని గణేష్‌పుర గ్రామంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

వివరాల్లోకి వెళ్తే.. గణేష్‌పుర గ్రామవాసులు కొవిడ్‌ను పోవాలంటూ వింత ప్రదర్శన చేశారు. దీపాలు పట్టుకుని వీధుల్లో పరిగెత్తుతూ.. ‘భాగ్‌ కరోనా భాగ్‌’ అని నినాదాలు చేశారు. అనంతరం పొలిమేరలకు వెళ్లి దీపాల్ని గ్రామం బయట పడేలా గాల్లోకి విసిరేశారు. ఇలా చేయడం ద్వారా కరోనా తమ గ్రామం నుంచి పోతుందని వారు విశ్వసిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ స్థానిక యువకుడు మాట్లాడుతూ.. ‘గ్రామంలో ఏదైనా అంటువ్యాధి ప్రబలితే.. ప్రతి ఇంటి నుంచి ఒకరు దీపం పట్టుకుని పరుగెత్తి.. దాన్ని ఊరిబయట పడేస్తే వ్యాధి పోతుందని పెద్దలు చెబుతుంటారు. అందుకే ఇప్పుడు కరోనా నుంచి గ్రామాన్ని రక్షించడం కోసం మేమంతా ఇలా చేశాం. మా గ్రామంలో గత రెండు మూడు రోజులుగా నిత్యం ఏదో కారణంతో ఒకరు మరణిస్తున్నారు. దీంతో ప్రజలు ఆందోళనలో ఉన్నారు’ అని తెలిపారు. 

గతేడాది కరోనా వ్యాప్తి ప్రారంభంలోనూ కేంద్రమంత్రి రామ్‌దాస్‌ అథవాలే మంత్రం జపించడం ద్వారా వైరస్‌ను నివారించవచ్చంటూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. కరోనాను నివారించడానికి ‘గో కరోనా గో’ అనే మంత్రాన్ని జపించాలని చెప్పారు. అప్పట్లో ఆయన మంత్రం జపించిన వీడియో సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌గా మారింది. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని