కోహ్లీ యాబ్స్‌ చూశారా.. అందరూ ఫిదాయే! - look how virat kohli doing workouts
close
Published : 07/08/2020 02:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కోహ్లీ యాబ్స్‌ చూశారా.. అందరూ ఫిదాయే!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇండియన్‌ ప్రీమియర్ లీగ్‌-2020 తేదీలు అధికారికంగా ప్రకటించడమే ఆలస్యం క్రికెటర్లంతా సాధనకు సిద్ధమైయ్యారు. బ్యాట్స్‌మెన్‌ బ్యాటు పట్టుకున్నారు. బౌలర్లు బంతిని అందుకున్నారు. ఎవరి విభాగాల్లో వారు సాధన చేస్తూనే మరోవైపు కసరత్తులు మొదలు పెట్టేశారు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు సారథి విరాట్‌ కోహ్లీ ఓ అడుగు ముందే ఉన్నాడు. విపరీతంగా శ్రమిస్తున్నాడు. ఇప్పటికీ అతడు పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నట్టు కనిపిస్తున్నాడు. తాజాగా విరాట్‌ ట్రెడ్‌మిల్‌పై పరుగెత్తుతున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. సాధన చాలా తీవ్రంగా చేస్తున్నాడు. అంతేకాదండోయ్‌! టీమ్‌ఇండియాలోనే అత్యంత ఫిట్‌గా ఉండే కోహ్లీ దేహాన్ని ఇప్పుడు మీరూ చూడొచ్చు. ఎందుకంటే చొక్కా లేకుండానే అతడు పరుగెత్తాడు. దాంతో అతడి యాబ్స్‌ను చూసి అభిమానులు వావ్‌! అని ఫిదా అయిపోతున్నారు. 

సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 10 వరకు ఐపీఎల్‌-2020 జరుగుతుంది. కరోనా వైరస్‌తో భారత్‌లో టోర్నీ నిర్వహణకు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో వేదికను యూఏఈగా నిర్ణయించారు. షార్జా, దుబాయ్‌, అబుదాబిలో మ్యాచులు జరుగుతాయి. ఆగస్టు 20 తర్వాత జట్లు అక్కడి వెళ్లే అవకాశం ఉంది. ఇన్నాళ్లూ లాక్‌డౌన్‌ కారణంగా ఇంట్లోనే ఉండిపోయిన క్రికెటర్లు తేదీలు ప్రకటించడంతో సాధన మొదలుపెట్టారు. చెన్నై సూపర్‌కింగ్స్‌ సారథి ఎంఎస్‌ ధోనీ, ముంబయి ఇండియన్స్‌ నాయకుడు రోహిత్‌ శర్మ ఇంటివద్దే కసరత్తులు చేస్తున్నారు.

స్థానిక మైదానాలు అందుబాటులో ఉన్నవారు అక్కడికే వెళ్లి సాధన చేస్తున్నారు. సురేశ్‌ రైనా, రిషభ్‌ పంత్‌, ఇషాంత్‌ శర్మ, పియూష్‌ చావ్లా‌, మహ్మద్‌ షమి ఘాజియాబాద్‌లోని మైదానంలో శ్రమిస్తున్నారు. రాజస్థాన్‌ రాయల్స్‌ యువ ఆటగాడు త్రివేండ్రంలోని మైదానంలో లాక్‌డౌన్‌లోనూ కష్టపడ్డాడు. ఈ సారి కసితో కనిపిస్తున్నాడు. నెల రోజులకు పైగా సమయం ఉండటంతో అందరూ నిలకడగా ఫిట్‌నెస్‌ సాధించే పనిలో పడ్డారు.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని