మహారాష్ట్రలో కరోనా కొత్త రికార్డు! - maharashtra reports 31855 new covid cases in a day
close
Published : 24/03/2021 22:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహారాష్ట్రలో కరోనా కొత్త రికార్డు!

ముంబయి: మహారాష్ట్రలో కరోనా వైరస్‌ ఉరుముతోంది. రోజువారీ కేసుల్లో ఇప్పటికే ఉన్న రికార్డులను బ్రేక్‌ చేసింది. ఇప్పటివరకు ఎన్నడూలేని విధంగా బుధవారం ఒక్కరోజే 32,855 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఒక్క ముంబయి మహా నగరంలోనే 5,185 కొత్త కేసులు రావడం గమనార్హం. గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 95 మరణాలు నమోదు కాగా.. 15,098 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు.

మహారాష్ట్రలో ఇప్పటివరకు 1,87,25,037 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 25,64,881 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో 22,62,593మంది కోలుకోగా.. 53,684 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 2,47,299 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దేశంలో యాక్టివ్‌ కేసులు అత్యధికంగా ఉన్న టాప్‌ 10 జిల్లాల్లో మహారాష్ట్రలోనే తొమ్మిది జిల్లాలు ఉండటం అక్కడ వైరస్‌ ఉద్ధృతికి నిదర్శనం. మరోవైపు, మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుదలపై తీవ్ర ఆందోళన చెందుతున్నట్టు కేంద్రం తెలిపింది.

నాసిక్‌లో లాక్‌డౌన్‌
కరోనా కేసులు పెరుదల దృష్ట్యా మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు అమలుచేస్తున్నారు. తాజాగా నాసిక్‌లో మార్చి 31వరకు లాక్‌డౌన్‌ విధించారు. అత్యవసర సర్వీసులు మినహా అన్ని దుకాణాలను శని, ఆదివారాల్లో మూసివేయాలని అధికారులు ఆదేశించారు. మిగతా రోజుల్లో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు తెరిచేందుకు అవకాశం కల్పించారు. 

ఔరంగాబాద్‌లో ఏప్రిల్‌ 11 వరకు ఇప్పటికే లాక్‌డౌన్‌ విధించిన అధికారులు తాజాగా అక్కడ 144 సెక్షన్‌ విధించారు. ఈ నిబంధన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అమల్లో ఉంటుందని తెలిపారు. మరోవైపు, నాందేడ్‌లో ఈ నెల 25 నుంచి ఏప్రిల్‌ 5 వరకు మొత్తం పది రోజుల లాక్‌డౌన్‌ ప్రకటించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని