మహేశ్‌కు ఈరోజు చాలా స్పెషల్‌ - maheshbabu wishes namratha on her birthday
close
Updated : 22/01/2021 11:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహేశ్‌కు ఈరోజు చాలా స్పెషల్‌

ఎందుకో తెలుసా..?

హైదరాబాద్‌: ఈరోజు తనకెంతో ప్రత్యేకమని సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు అన్నారు. కుటుంబసభ్యులతో కలిసి దుబాయ్‌ టూర్‌లో ఉన్న ఆయన తాజాగా ఇన్‌స్టా వేదికగా అభిమానులతో ఓ చక్కటి సందేశాన్ని పంచుకున్నారు. తన సతీమణి నమ్రత శిరోద్కర్‌తో కలిసి దిగిన ఓ అపురూప చిత్రాన్ని షేర్‌ చేశారు.

‘నేనెంతో ప్రేమించే వ్యక్తి పుట్టినరోజు నేడు. నమ్రత.. నీతో ప్రతిరోజూ ప్రత్యేకంగా ఉంటుంది కానీ ఈరోజు మాత్రం మరెంతో ప్రత్యేకం. నా అద్భుతమైన మహిళకు జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్‌డే బాస్‌ లేడీ’ అని మహేశ్‌ పేర్కొన్నారు. ఆయన పెట్టిన పోస్ట్‌పై నమ్రత సంతోషం వ్యక్తం చేశారు. ‘నా ప్రతి ఏడాదినీ ఎంతో స్పెషల్‌గా చేస్తున్నందుకు థ్యాంక్యూ. లవ్‌ యూ’ అని రిప్లై ఇచ్చారు. నమ్రత పుట్టినరోజు వేడుకల కోసమే మహేశ్‌ కుటుంబం దుబాయ్‌ వెళ్లినట్లు తెలుస్తోంది.

‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం తర్వాత ‘సర్కారువారి పాట’లో మహేశ్‌ నటించనున్నారు. పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో ఆయనకు జోడీగా కీర్తి సురేశ్‌ సందడి చేయనున్నారు. త్వరలో ఈ సినిమా షూట్‌ దుబాయ్‌లో ప్రారంభం కానుందని వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఇందులో మహేశ్‌ పొడవాటి జుట్టు.. విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. ఇందులోని పాత్ర కోసం ఆయన కాస్త బరువు తగ్గి మరింత స్టైలిష్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, మైత్రీ మూవీస్‌, 14రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

ఇదీ చదవండి

రాధికా ఆంటీ.. నా సీక్రెట్స్‌ బయటపెట్టేస్తుంది..!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని