Crime news: రన్నింగ్‌ బస్సు ఎక్కబోతే.. చక్రాల కింద పడి.. - man tries to catch running bus dies after coming under its wheel
close
Published : 12/08/2021 18:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Crime news: రన్నింగ్‌ బస్సు ఎక్కబోతే.. చక్రాల కింద పడి..

ముంబయి: రోడ్డుపై వెళ్తున్న బస్సు ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ వృద్ధుడు ప్రమాదవశాత్తూ అదే బస్సు చక్రాల కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన ముంబయిలో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే.. ముంబయిలోని గోరేగావ్‌ సబర్బన్‌ ప్రాంతంలో 55 ఏళ్ల వృద్ధుడు రన్నింగ్‌ బస్సు ఎక్కేందుకు ప్రయత్నించి అదుపు తప్పాడు. దీంతో వెనుక చక్రం కింద పడిపోయాడు. గోరేగావ్‌ బస్సు డిపో సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిర్లక్ష్యంగా బస్సు నడిపిన డ్రైవర్‌ను అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. మృతుడుని వసంత్‌ గోండు ఘోలేగా గుర్తించారు. బస్సు వెనుక చక్రం కింద పడిపోయిన వృద్ధుడిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజీని సేకరించామని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని