TS: 10రోజుల్లోగా 3,010 కొత్త ఐసీయూ పడకలు - minister eatala teleconference with health ministry officials
close
Published : 29/04/2021 20:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TS: 10రోజుల్లోగా 3,010 కొత్త ఐసీయూ పడకలు

వైద్యాధికారులు, సూపరింటెండెంట్లతో ఈటల టెలీకాన్ఫరెన్స్

హైదరాబాద్‌: రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో కొవిడ్‌ చికిత్స పొందుతున్న బాధితులను ప్రతి రెండు గంటలకు ఒకసారి పర్యవేక్షించాలని.. బాధితుల కుటుంబసభ్యులకు సమాచారం అందించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అధికారులను ఆదేశించారు. ఆ శాఖ ఉన్నతాధికారులు, జిల్లాల వైద్యాధికారులు, ఆస్పత్రుల సూపరింటెండెంట్లతో మంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కంటి మీద కునుకు లేకుండా పని చేస్తున్నందునే కరోనా వ్యాప్తి నియంత్రణలో మెరుగ్గా ఉన్నామని.. చిన్న చిన్న సమస్యలు కూడా లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఆస్పత్రుల్లో పరిశుభ్రత ఉండేలా చూడాలని, ఆక్సిజన్ కనీసం 24 గంటల ముందస్తుగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. 3,010 కొత్త ఐసీయూ పడకలను పది రోజుల్లోగా అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ పరీక్షలు: డీహెచ్‌ డా.శ్రీనివాస్‌

‘‘టెస్టింగ్, ట్రేసింగ్ చేస్తూ కొవిడ్‌ ఎక్కువగా వ్యాప్తి చెందకుండా ఆపగలుగుతున్నాం. లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేయాలని, వెంటనే చికిత్స మొదలు పెట్టాలని చెప్పాం. హోం ఐసోలేషన్‌లో ఉన్న ప్రతి ఒక్కరినీ ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పరిశీలించాలి. ఐదు రోజులకు మించి లక్షణాలన్నా, సాచురేషన్ స్థాయి 95 కంటే తగ్గినా వైద్యుల పర్యవేక్షణలో ఆస్పత్రులకు తరలించాలి. టీకా రెండో డోస్ వేసుకునే వారికి ఇబ్బందులు రాకుండా చూడాలి. ముందుగా వారికి వ్యాక్సిన్ అందించాలి. 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియపై త్వరలో మార్గదర్శకాలు జారీ చేస్తాం. ప్రస్తుతం ఆస్పత్రుల పాత్ర చాలా కీలకం’’ అని అధికారులకు డీహెచ్‌ సూచించారు.

ప్రతి ఆస్పత్రిలో ఒక నోడల్ అధికారి: డీఎంహెచ్‌వో రమేష్‌ రెడ్డి
‘‘పరీక్షలు, వ్యాక్సిన్ కోసం వచ్చే వారిలో సీనియర్ సిటిజన్లకు విడిగా క్యూలైన్లు ఏర్పాటు చేయాలి. ఆక్సిజన్, ఐసీయూ, వెంటిలేటర్ పడకల కోసం ఎక్కువ డిమాండ్ వస్తోంది. ఎంత మంది బాధితులు వచ్చినా చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. బాధితుల పరిస్థితిని ఉదయం, సాయంత్రం పరిశీలించి బాగా ఉన్న వారిని డిశ్చార్జ్ చేయాలి. వారి ఆరోగ్య పరిస్థితిని ప్రతి రోజూ వారి బంధువులకు ఫోన్ ద్వారా అందించాలి. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఆక్సిజన్ నిల్వల సమాచారం కోసం ప్రతి ఆస్పత్రిలో ఒక నోడల్ అధికారిని ఏర్పాటు చేస్తున్నాం’’ అని డీఎంహెచ్‌వో వివరించారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని