Team India: అది కోహ్లీది కాదు.. రవిశాస్త్రి ఘనత..  - monty panesar feels team india is ravi shastris contribution more than virat kohli
close
Published : 28/05/2021 20:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Team India: అది కోహ్లీది కాదు.. రవిశాస్త్రి ఘనత.. 

భారత జట్టుపై మాంటీ పనేసర్‌ వ్యాఖ్యలు..

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా ప్రస్తుతమున్న పరిస్థితికి హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి కారణమని, కెప్టెన్‌ విరాట్ కోహ్లీ కాదని ఇంగ్లాండ్‌ మాజీ స్పిన్నర్‌ మాంటీ పనేసర్‌ అభిప్రాయపడ్డాడు. తాజాగా అతడు ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఎలాంటి బెరుకు లేని శాస్త్రి విధానం వల్లే టీమ్‌ఇండియా గొప్పగా రాణిస్తోందని చెప్పాడు. ఇటీవలి కాలంలో టెస్టు క్రికెట్‌లో భారత జట్టు మెరుగైన ఫలితాలు సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు అగ్రస్థానంలో దూసుకెళ్లింది. దాంతో వచ్చేనెలలో న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. అందులో శాస్త్రి గొప్పతనమే కనిపిస్తుందని పనేసర్‌ చెప్పుకొచ్చాడు.

భారత ఆటగాళ్లలో హెడ్‌కోచ్‌ ఆత్మవిశ్వాసం నింపాడని, ఆస్ట్రేలియా పర్యటనలో తొలి టెస్టులో 36 పరుగులకే ఆలౌట్ అయ్యాక జట్టును ముందుండి నడిపించాడని ఇంగ్లాండ్‌ మాజీ పేసర్‌ వివరించాడు. ఆ తర్వాత టీమ్‌ఇండియా చెలరేగి అద్భుతం చేసిందన్నాడు. కీలకమైన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ లేకపోయినా, సీనియర్లు గాయాలతో దూరమైనా యువ ఆటగాళ్లతోనే టీమ్‌ఇండియా సిరీస్‌ కైవసం చేసుకుందని మెచ్చుకున్నాడు. ఆ పర్యటనలో శాస్త్రినే కీలకంగా వ్యవహరించాడని కితాబిచ్చాడు. అనంతరం టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌పై స్పందించిన పనేసర్‌.. టీమ్‌ఇండియా ఆ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌తో బరిలోకి దిగాలని సూచించాడు. వాళ్లిద్దరూ భారత జట్టుకు ముఖ్యమైన ఆటగాళ్లని పేర్కొన్నాడు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని