మారనున్న సినిమా పేరు? - name searching for salman new movie
close
Published : 02/05/2021 13:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మారనున్న సినిమా పేరు?

‘కిక్‌’ లాంటి భారీ విజయం తర్వాత సల్మాన్‌ఖాన్, నిర్మాత సాజిద్‌ నడియాడ్‌వాలా నుంచి వస్తున్న చిత్రం ‘కభీ ఈద్‌ కభీ దివాలీ’. ఫర్హాద్‌ సామ్‌జీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయిక. ఆయుష్‌ శర్మ, జహీర్‌ ఇక్బాల్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా పేరుని మార్చడం గురించి ఆలోచిస్తున్నారు. ‘‘కభీ ఈద్‌ కభీ దివాలీ’ పేరుని మార్చనున్నారు. పలు పేర్లు పరిశీలిస్తున్నారు. ఇంకా ఏదీ ఫైనల్‌ కాలేదు. రెండు మతాలకు సంబంధించిన కీలక పండగల పేర్లు ఇందులో ఉండటంతో వివాదాలు చెలరేగుతాయేమో అనే ఆలోచనలో ఉంది చిత్రబృందం. అన్ని మతాల్ని గౌరవించాలనే ఉద్దేశంతో ఈ సినిమాకు కొత్త టైటిల్‌ను నిర్ణయించనున్నారు’’అని సాజిద్‌ సన్నిహిత వర్గాలు చెప్పినట్టు సమాచారం.

దేవుడు ఒక్కడే అనే ఇతివృత్తంతో సాగే కథ ఇది. ఈ ఏడాది సెప్టెంబరు నుంచి ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని