వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఎఫెక్ట్‌: 90%మందికి నొప్పులే! - ninty percent whf workers getting aches
close
Updated : 09/02/2021 05:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఎఫెక్ట్‌: 90%మందికి నొప్పులే!

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా.. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలకు చెందిన ఉద్యోగులు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్నారు. మొదట్లో హాయిగా ఇంట్లోనే కూర్చొని పనిచేసుకోవచ్చని భావించినవాళ్లంతా ఇప్పుడు.. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోతున్నారు. అధిక సమయం కూర్చొని పని చేస్తుండటంతో ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని అంటున్నారు. హర్మన్‌ మిల్లర్‌ అనే ఆఫీస్‌ ఫర్నిచర్‌ తయారీ సంస్థ ప్రపంచవ్యాప్తంగా కొంతమంది వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్న ఉద్యోగులపై సర్వే నిర్వహించగా ఈ విషయాలు వెల్లడయ్యాయి. 

లాక్‌డౌన్‌కు ముందు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్ చేసిన సమయం కంటే లాక్‌డౌన్‌ సమయంలో.. ప్రస్తుతం 20శాతం ఎక్కువ సేపు కూర్చొని పనిచేస్తున్నారట. ఇలా పనిచేయడం వల్ల 90శాతం మందికి శారీరక నొప్పులు, మానసిక ఒత్తిడి పెరుగుతోందని సర్వే నిర్వహించిన సంస్థ తెలిపింది. 39.40శాతం మందికి మెడ నొప్పి, 53.13శాతం మందికి నడుము నొప్పి, 44.28శాతం మందికి నిద్ర పట్టకపోవడం, 34.53శాతం మందికి చేతులు.. 33.83శాతం మందికి కాళ్ల నొప్పులు ఉన్నాయట. 27.26శాతం మందికి తలనొప్పి.. కళ్లు లాగడం జరుగుతున్నాయని సర్వేలో తేలింది. పదిలో తొమ్మిది మంది ఈ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని హర్మన్‌ మిల్లర్‌ సంస్థ పేర్కొంది. 

ఇవీ చదవండి..

ఇంటి నుంచి కాదు.. విదేశాల నుంచి పని చేస్తారా?

ఆఫీస్‌ చైర్‌ను ఆవిష్కరించిందెవరో తెలుసా?మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని