BigBoss ఆఫర్‌ వచ్చినా చేయను: భూమిక - no i wont do bigboss if offered says bhumika chawla
close
Published : 06/06/2021 18:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

BigBoss ఆఫర్‌ వచ్చినా చేయను: భూమిక

ఇంటర్నెట్‌ డెస్క్‌: బిగ్‌బాస్‌లో పాల్గొనే ఆసక్తి తనకు లేదని నటి భూమిక తేల్చి చెప్పేసింది. బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న హిందీ బిగ్‌బాస్‌లో ఆమె పాల్గొనబోతోందంటూ ఇటీవల వార్తలు వినిపిస్తున్నాయి. ఈమేరకు బిగ్‌బాస్‌ బృందం ఈ ‘ఖుషి’ భామను సంప్రదించినట్లు చర్చలు సాగాయి. త్వరలో ప్రారంభంకానున్న ఈ బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి అడుగుపెట్టబోయే 15 సభ్యుల్లో భూమిక కూడా ఉండే అవకాశాలున్నాయని పలు పత్రికలతో పాటు సోషల్‌ మీడియాలోనూ కథనాలు వచ్చాయి. అయితే.. ఈ వార్తలకు భూమిక స్వయంగా ఫుల్‌స్టాప్‌ పెట్టింది. ట్విటర్‌ వేదికగా ఆమె బిగ్‌బాస్‌ వ్యవహారంపై తన  వైఖరి వెల్లడించింది.

‘‘బిగ్‌బాస్‌లో నేను పాల్గొంటున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. బిగ్‌బాస్‌ బృందం ఈసారి నన్ను సంప్రదించలేదు. ఒకవేళ వాళ్లు అడిగినా అందులో పాల్గొనే ఆసక్తి నాకు లేదు. బిగ్‌బాస్‌ 1, 2, 3 సీజన్లతో పాటు తర్వాత కొన్ని సీజన్లకు నన్ను వాళ్లు సంప్రదించారు. కానీ, నేను అందుకు అంగీకరించలేదు. ఈసారి మాత్రం ఎవరూ నన్ను సంప్రదించలేదు. నేను పబ్లిక్‌ పర్సనాలిటీని. అంతమాత్రాన 24గంటలు నా వ్యక్తిగత జీవితంపై కెమెరాలు ఉంచడం నాకు ఇష్టం లేదు’ అని ఆమె స్పష్టం చేసింది. కాగా.. ఎంతో పాపులారిటీ సాధించిన హిందీ బిగ్‌బాస్‌ ఇప్పటికే 14 సీజన్లు పూర్తి చేసుకొని 15వ సీజన్‌కు సిద్ధమైంది. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని