Covid vaccine: రాష్ట్రాల వద్ద 1.19కోట్లకుపైగా డోసులు - over 1.19 crore doses still available with states says centre
close
Published : 08/06/2021 22:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Covid vaccine: రాష్ట్రాల వద్ద 1.19కోట్లకుపైగా డోసులు

వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ

దిల్లీ: రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద ప్రస్తుతం 1.19కోట్లకు పైగా కరోనా టీకా డోసులు అందుబాటులో ఉన్నాయని మంగళవారం కేంద్రం వెల్లడించింది. అలాగే ఇప్పటివరకు 24కోట్లకు పైగా డోసులను సరఫరా చేయగా.. 23,47,43,489 టీకాలు ప్రజలకు అందినట్లు పేర్కొంది. అందులో వృథా అయిన డోసుల సంఖ్య కూడా కలిసే ఉన్నట్లు చెప్పింది. 

‘దేశవ్యాప్తంగా నడుస్తోన్న కరోనా టీకా కార్యక్రమం కింద రాష్ట్రాలకు కేంద్రం ఉచితంగా టీకాలు అందజేస్తోంది. అలాగే అవి నేరుగా టీకాలు సేకరించేందుకు సదుపాయం కల్పిస్తోంది. ప్రస్తుతం వాటి వద్ద 1,19,46,925 కోట్ల డోసులు అందుబాటులో ఉన్నాయి’ అని కేంద్ర ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. జనవరి 16న దేశవ్యాప్తంగా కరోనా టీకా కార్యక్రమం ప్రారంభమైంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని