Covid: కేరళలో నాలుగో రోజూ 20 వేలకుపైనే.. తమిళనాడులో లాక్‌డౌన్‌ పొడిగింపు - over 20000 new covid cases in kerala for fourth straight day
close
Published : 31/07/2021 01:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Covid: కేరళలో నాలుగో రోజూ 20 వేలకుపైనే.. తమిళనాడులో లాక్‌డౌన్‌ పొడిగింపు

తిరువనంతపురం: కేరళను కరోనా మహమ్మారి వణికిస్తోంది. వరుసగా నాలుగో రోజూ ఆ రాష్ట్రంలో 20వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కేరళలో 20,772 కొవిడ్‌ కేసులు బయటపడ్డాయి. 116 మంది మృతిచెందారు. తాజాగా కొవిడ్‌ బారిన పడినవారిలో 81 మంది ఆరోగ్య కార్యకర్తలే ఉన్నారు. పలు జిల్లాల్లో మహమ్మారి తీవ్రత కొనసాగుతోంది. మలప్పురం జిల్లాలో అత్యధికంగా 3670 కేసులు, కోలికోడ్‌లో 2470, ఎర్నాకుళంలో 2306, త్రిస్సూర్‌లో 2287, పాలక్కడ్‌ జిల్లాలో 2070 కేసులు చొప్పున నమోదయ్యాయి.

గడిచిన 24 గంటల్లో 1,52,639 మందికి పరీక్షలు నిర్వహించగా భారీ సంఖ్యలో కేసులు నమోదవడంతో పాజిటివిటీ రేటు 13.61 శాతానికి పెరిగింది. రాష్ట్రంలోని 678 ప్రాంతాల్లో పాజిటివిటీ రేటు 10 శాతానికిపైగా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,60,824 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇందులో 27,833 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 14,651 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. కేరళలో ఇప్పటివరకు మొత్తంగా 33,70,137 మంది కొవిడ్‌ బారిన పడగా.. 16,701 మంది మృతిచెందారు.

తమిళనాట ఆగస్టు 8వరకు లాక్‌డౌన్‌

తమిళనాడులో లాక్‌డౌన్‌ను మరో వారం పొడిగించారు. ఆగస్టు 8వరకు లాక్‌డౌన్‌ కొనసాగుతుందని సీఎం స్టాలిన్‌ వెల్లడించారు. కొత్తగా ఎలాంటి సడలింపులూ ఇవ్వలేదు. థర్డ్‌ వేవ్‌ ముప్పు పొంచి ఉన్నందున అనవసరంగా జనం బయట తిరగవద్దని సూచించారు. కొవిడ్‌ నిబంధనలు కఠినంగా అమలయ్యేలా చూడాలని స్థానిక అధికార యంత్రాంగంతో పాటు పోలీసులకు ఆదేశించారు. రాష్ట్రంలో చాలా రోజుల తర్వాత మళ్లీ నిన్న స్వల్పంగా కేసులు పెరిగాయి. చెన్నై, కోయంబత్తూరులో వరుసగా మూడోరోజూ కొత్త కేసులు స్వల్పంగా పెరుగుదల నమోదైంది. దీంతో జనజమూహాలు అధికంగా గుమిగూడకుండా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు. అనుమతించిన దానికన్నా ఎక్కువ మంది వినియోగదారులు గుమిగూడిన దుకాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో గతంలో విధించిన లాక్‌డౌన్‌ జులై 16తో ముగియగా ఆ తర్వాత దాన్ని ఈ నెల 31వరకు పొడిగించారు. మళ్లీ స్వల్పంగా కేసులు పెరుగుతుండటంతో తాజాగా ఆ గడువును మరోవారం పాటు పొడిగించారు. 

గడిచిన 24గంటల వ్యవధిలో తమిళనాడులో 1859 కొత్త కేసులు, 28మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం అక్కడ యాక్టివ్‌ కేసులు 21,207గా ఉన్నాయి. గత 10 రోజులకు పైగా కొత్త కేసులు 2వేల మార్కు కన్నాతక్కువగానే నమోదవుతున్నాయి.రాష్ట్రంలో ఇప్పటివరకు 2.23 కోట్ల డోసులు పంపిణీ జరగ్గా... దాదాపు 40లక్షల మందికి పైగా రెండో డోసులూ అదుకున్నారు



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని