అందుకే భాజపాతో కలిసి వెళ్తున్నాం: పవన్‌ - pawan kalyan in tirupati loksabha bypoll
close
Updated : 13/03/2021 14:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అందుకే భాజపాతో కలిసి వెళ్తున్నాం: పవన్‌

అమరావతి: తిరుపతి ఉపఎన్నిక ద్వారా వైకాపా ఆగడాలకు దీటైన సమాధానం చెప్పాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. భాజపా జాతీయ స్థాయి నేతలతో చర్చల తర్వాతనే తిరుపతి ఉపఎన్నికలో ఆ పార్టీ అభ్యర్థిని బలపరిచినట్లు చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తిరుపతిలో విజయం కోసం సమష్టిగా కృషి చేయాలన్నారు. జనసేన అభ్యర్థి పోటీ చేయడం కంటే తిరుపతి అభివృద్ధే ముఖ్యమైనదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

రాష్ట్ర ప్రగతి, శాంతి భద్రతల పరిరక్షణకు తాము తీసుకున్న నిర్ణయం మేలు చేస్తుందని పవన్‌ అన్నారు. అందరికీ ఆమోదయోగ్యుడైన, బలమైన అభ్యర్థి ఉన్నట్లయితే తప్పకుండా ఆ స్థానాన్ని భాజపాకు అప్పగిస్తామని మొదట్నుంచీ చెప్తూ వచ్చినట్లు గుర్తుచేశారు. రాష్ట్రంలోని ఆలయాలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో వాటి పరిరక్షణకు భాజపా తగు చర్యలు తీసుకుంటుందనే విశ్వాసం ఉందన్నారు. జనసేన పార్టీ తరఫున ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది సంస్థాగతంగా బలపడేందుకే అనే విషయాన్ని గమనించాలని కార్యకర్తలకు పవన్‌ సూచించారు. రాష్ట్రంలోని అరాచక శక్తులను ఎదుర్కొనేందుకే భాజపాతో కలిసి ముందుకు సాగుతున్నట్లు స్పష్టం చేశారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని