పవన్‌కల్యాణ్‌ ‘వకీల్‌సాబ్‌’ ట్రైలర్‌ వచ్చేసింది - pawan kalyan vakeel saab trailer released
close
Published : 29/03/2021 18:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పవన్‌కల్యాణ్‌ ‘వకీల్‌సాబ్‌’ ట్రైలర్‌ వచ్చేసింది

హైదరాబాద్‌: పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వకీల్‌సాబ్‌’. శ్రుతిహాసన్‌, నివేదా థామస్‌, అంజలి, అనన్య నాగళ్ల ముఖ్య పాత్రలు పోషించారు. సోమవారం ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. ‘కోర్టులో వాదించడమూ తెలుసు.. కోటు తీసి కొట్టడమూ తెలుసు’ అంటూ టీజర్‌లో అదరగొట్టిన పవన్‌ ఈసారి మరింత పవర్‌ఫుల్‌గా కనిపించారు. హైదరాబాద్‌ సహా వివిధ జిల్లాల్లోని థియేటర్‌లలో వకీల్‌సాబ్‌ ట్రైలర్‌ను ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా థియేటర్ల వద్ద పవన్‌ అభిమానుల కోలాహలం నెలకొంది.

పవన్‌ తన పాత్రకు డబ్బింగ్‌ను కూడా పూర్తి చేశారు. బాలీవుడ్‌లో విజయవంతమైన ‘పింక్‌’కి రీమేక్‌గా రూపొందుతోన్న చిత్రమిది. పవన్‌ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని కథలో చాలా మార్పులు చేశారు. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకం దిల్‌రాజు, శిరీశ్‌ నిర్మిస్తున్నారు. బోనీకపూర్‌ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకొస్తోంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని