మాస్క్‌ ధరించలేదని అత్యవసర ల్యాండింగ్‌! - plane landed as emergency due to passenger deny to wear a mask
close
Published : 09/09/2020 20:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మాస్క్‌ ధరించలేదని అత్యవసర ల్యాండింగ్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో ప్రజలంతా మాస్కులు ధరించడం తప్పనిసరైంది. ఎక్కడికి వెళ్లినా మాస్కులు పెట్టుకోవాల్సిందేనని కఠిన నియమాలు అమలు చేస్తున్నారు. ఎంతలా అంటే.. ఓ ప్రయాణికుడు మాస్కు పెట్టుకోలేదని ఏకంగా గాల్లో ప్రయాణిస్తున్న విమానాన్ని అత్యవసర ల్యాండింగ్‌ చేసి అతడిని అరెస్టు చేసేంతలా..!

సాధారణంగానే విమాన ప్రయాణ నిబంధనలను చాలా కఠినంగా అమలు చేస్తుంటారు. వాటిని అతిక్రమించినా, సిబ్బందితో దురుసుగా ప్రవర్తించినా వారిని బ్లాక్‌లిస్టులో పెట్టి విమాన ప్రయాణాలు చేయకుండా అనర్హత వేటు వేస్తుంటుంటారు. అయితే ఇటీవల బ్రిటన్‌కి చెందిన 32 ఏళ్ల ఓ ప్రయాణికుడు టర్కీలోని అంతల్య ఎయిర్‌పోర్టులో విమానం ఎక్కాడు. విమానం గాల్లోకి లేచిన తర్వాత మాస్కు ధరించాలని విమానంలోని సిబ్బంది అతడికి చెప్పినా అందుకు నిరాకరించాడు. దీంతో ఇతర ప్రయాణికులు అతడి సమీపంలో కూర్చొడానికి ఇష్టపడలేదు. ఎవరు ఎంత చెప్పినా అతడు మాస్కు ధరించకపోగా.. ప్రయాణికులు, విమాన సిబ్బందితో గొడవకు దిగాడు. ఈ విషయం పైలట్స్‌కి తెలియడంతో మార్గమధ్యంలోని కొస్‌ ఐలాండ్‌ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్‌ చేశారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని మాస్కు ధరించని వ్యక్తిని అరెస్టు చేసి తీసుకెళ్లారు. అనంతరం విమానం మళ్లీ గాల్లోకి ఎగిరింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని