పంజాబ్‌ రాజకీయం.. రేపు పీసీసీ కీలక భేటీ - ppcc chief sunil jakhar calls meeting of mlas on monday
close
Updated : 18/07/2021 21:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పంజాబ్‌ రాజకీయం.. రేపు పీసీసీ కీలక భేటీ

చండీగఢ్‌: పంజాబ్‌లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. సిద్ధూకు పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టనున్నారన్న ఊహాగానాల నేపథ్యంలో ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు సునీల్‌ జాఖడ్‌ కీలక సమావేశానికి పిలుపునిచ్చారు. పార్టీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. పార్టీ అధిష్ఠానం ఏం నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామంటూ ఈ భేటీలో తీర్మానం చేయనున్నారు. ఈ తీర్మానాన్ని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీకి పంపనున్నారు.

పంజాబ్‌లో అమరీందర్‌, సిద్ధూ మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించే దిశగా అధిష్ఠానం అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఈ భేటీ జరగనుంది. నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూతో పాటు, కుల సమీకరణాల ఆధారంగా ఖాళీగా ఉన్న పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పోస్టులను కూడా కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం భర్తీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు అమరీందర్‌కు మద్దతుగా 10 మంది ఎమ్మెల్యేలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. అమరీందర్‌ను పదవి నుంచి తొలగించవద్దని వారు అధిష్ఠానానికి విజ్ఞప్తి చేశారు. నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ ఓ సెలబ్రిటీ అని, పార్టీకి ఆయన కూడా ప్రధాన బలం అని వారు తెలిపారు. అయితే, పలు సందర్భాల్లో ప్రభుత్వంపైనా, పార్టీపైనా ఆయన చేసిన వ్యాఖ్యలు నష్టం కలిగించేవిగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. తనకు బహిరంగ క్షమాపణ చెప్పే వరకు సిద్ధూను కలిసేది లేదని అమరీందర్‌ కట్టుబడి ఉండడాన్ని వీరు సమర్థించారు. తమ నిర్ణయాలను పరిగణనలోకి తీసుకోవాలని అధిష్ఠానాన్ని కోరారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని