నవ్వించడంలో నాన్నే నాకు స్ఫూర్తి: రాశీ - raashi khanna about comedy
close
Published : 14/04/2021 10:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నవ్వించడంలో నాన్నే నాకు స్ఫూర్తి: రాశీ

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘కామెడీని పండించడంలో మా నాన్నే నాకు స్ఫూర్తి’ అంటోంది యువ నాయిక రాశీ ఖన్నా. గోపీచంద్‌ హీరోగా మారుతి తెరకెక్కిస్తోన్న ‘పక్కా కమర్షియల్‌’ చిత్రంలో నాయికగా నటిస్తోంది రాశీ. లాయరు పాత్రలో కడుపుబ్బా నవ్వించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తనకి నవ్వించడం చాలా తేలికైన పని అని, ఏదో పాత్ర కోసం నటించాలని కాకుండా సహజంగానే కామెడీని పండిస్తానని చెప్పుకొచ్చింది. ‘అందరూ హాస్యభరిత సన్నివేశాల్లో నటించడం చాలా కష్టం అంటుంటారు. కానీ, నాకు అలా అనిపించదు. కామెడీ సన్నివేశాల్లో నటించేటప్పుడు ఎంతో ఆనందిస్తాను. ఇదంతా మా నాన్న రాజ్‌ ఖన్నా వల్లే సాధ్యమైంది. ఆయన చాలా సరదా వ్యక్తి. ఆయన్ను చూస్తూ నేను అలా ఉండటం అలవాటు చేసుకున్నాను. ఇప్పుడు ఇలా తెరపై నవ్వులు పంచుతున్నానంటే దానికి కారణం నాన్నే అని భావిస్తున్నా’ అని పేర్కొన్నారు రాశీ. 

‘జిల్‌’ చిత్రం తర్వాత మరోసారి గోపీచంద్‌- రాశీ జోడీ సందడి చేయనుంది. ‘ప్రతిరోజూ పండగే’ తర్వాత మారుతి దర్శకత్వంలో రాశీ నటిస్తోన్న రెండో చిత్రమిది. ఈ సినిమాలో ఏంజెల్‌ ఆర్నగా ప్రేక్షకుల్ని అలరించింది. ‘పక్కా కమర్షియల్‌’లోనూ అలాంటి నవ్వులు పూయించే పాత్ర పోషిస్తోంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని