Malashree Husband: కొవిడ్‌తో నటి మాలాశ్రీ భర్త మృతి - ramu passed away
close
Updated : 27/04/2021 13:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Malashree Husband: కొవిడ్‌తో నటి మాలాశ్రీ భర్త మృతి

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. నిర్మాత, నటి మాలాశ్రీ భర్త రాము(52) కరోనాతో మరణించారు. కొవిడ్ పాజిటివ్‌ రావడంతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. 30కి పైగా చిత్రాల్ని నిర్మించారాయన. ఎ.కె.47, గంగ, కలాసిపాళ్య, ఆటో శంకర్‌, ఎలక్షన్‌, చాముండి, కంఠీవర తదితర సినిమాలు మంచి గుర్తింపు పొందాయి. కన్నడ చిత్ర  సీమలో ఆయనకు ‘కోటి నిర్మాత’ అనే పేరుంది. రాము మృతిపై కన్నడ చిత్రపరిశ్రమతోపాటు ఇతర సినీ పరిశ్రమలూ దిగ్ర్భాంతిని వ్యక్తం చేశాయి. రాము-మాలాశ్రీకి ఇద్దరు పిల్లలు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని