ఓటీటీలో... ‘థ్యాంక్‌ యు బ్రదర్‌’
close
Published : 27/04/2021 01:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఓటీటీలో... ‘థ్యాంక్‌ యు బ్రదర్‌’

నసూయ భరద్వాజ్‌, విరాజ్‌ అశ్విన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘థ్యాంక్‌ యు బ్రదర్‌’. రమేష్‌ రాపర్తి దర్శకత్వం వహిస్తున్నారు. మాగుంట శరత్‌చంద్రా రెడ్డి, తారక్‌నాథ్‌ బొమ్మిరెడ్డి నిర్మాతలు. ఈ నెలలోనే థియేటర్లలో విడుదల చేయాలనుకున్నారు నిర్మాతలు. కానీ కరోనా ఉద్ధృతి దృష్ట్యా నేరుగా ఓటీటీ వేదిక ‘ఆహా’ ద్వారా మే 7న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని నిర్ణయించారు. ఆ విషయాన్ని సోమవారం హైదరాబాద్‌లో ప్రకటించింది చిత్రబృందం. ‘‘అనుకోకుండా లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన ఓ యువకుడు, ఓ గర్భవతి మహిళ ఎదుర్కొన్న పరిస్థితుల నేపథ్యంలో సాగే కథ ఇది. ఆసక్తిని రేకెత్తించే డ్రామా, థ్రిల్లింగ్‌ అంశాలు, ఉత్సుకత రేకెత్తించే పతాక సన్నివేశాలతో ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతుంద’’ని సినీ వర్గాలు తెలిపాయి. అర్చనా అనంత్‌, అనీష్‌ కురువిల్లా, ఆదర్శ్‌ బాలకృష్ణ, మోనికారెడ్డి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: గుణ బాలసుబ్రమణియన్‌.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని