బాలీవుడ్‌ సింబా షూటింగ్‌కి సిద్ధమవుతున్నాడా? - ranveer getting ready to shoot
close
Published : 18/07/2020 00:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బాలీవుడ్‌ సింబా షూటింగ్‌కి సిద్ధమవుతున్నాడా?

ముంబయి: కరోనా, లాక్‌డౌన్‌తో సినీ పరిశ్రమ స్తంభించిపోయిన విషయం తెలిసిందే. దాదాపు మూడున్నర నెలల తర్వాత మళ్లీ సినిమా విడుదల, షూటింగ్స్‌ గురించి వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని సినిమాలు ఓటీటీ వేదికగా విడుదలవుతుంటే.. కొందరు నటీనటులు సినిమా షూటింగ్స్‌లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా బాలీవుడ్‌ సింబా రణ్‌వీర్‌సింగ్‌ కూడా షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఓ హెయిర్‌ స్టైలిస్ట్‌ సోషల్‌మీడియాలో పెట్టిన  పోస్టు వల్ల ఈ విషయం బయటపడింది.

రణ్‌వీర్‌సింగ్‌ నటించిన ‘83’ సినిమా విడుదల లాక్‌డౌన్‌తో వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ చిత్రం తర్వాత రణ్‌వీర్‌ ‘జయేష్‌భాయ్‌ జోర్దార్‌’చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే జోయా అక్తర్ దర్శకత్వంలో మరో చిత్రంలోనూ నటించబోతున్నాడు. అయితే ఈ చిత్రంలో రణ్‌వీర్‌సింగ్‌ పోలీసుగా, గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నాడట. లాక్‌డౌన్‌ వల్ల ఇంట్లోనే ఉంటున్న రణ్‌వీర్‌సింగ్‌.. ఇటీవల ఈ రెండు పాత్రలకు సూట్‌ అయ్యే హెయిర్‌స్టైల్‌ కోసం హెయిర్‌స్టైలిస్ట్‌ దర్శన్‌ ఎవలేఖర్‌ వద్దకు వెళ్లినట్లు తెలుస్తోంది. రెండు పాత్రలను తానే సొంతంగా డిజైన్‌ చేసుకోవాలని రణ్‌వీర్‌ భావిస్తున్నాడట. ఈ క్రమంలోనే దర్శన్‌తో కలిసి తన కొత్త లుక్‌ కోసం ప్రయోగాలు చేస్తున్నాడట. ఇటీవల రణ్‌వీర్‌తో కలిసి దిగిన ఓ ఫొటోను హెయిర్‌స్టైలిస్ట్‌ దర్శన్‌ ఎవలేఖర్‌ సోషల్‌మీడియాలో పెట్టారు. ఆ ఫొటోలో రణ్‌వీర్‌సింగ్‌ నలుపు రంగు దుస్తులు వేసుకొని, నలుపు రంగు టోపీ, కళ్లాద్దాలతో కొత్తగా కనిపిస్తున్నాడు. దీంతో రణ్‌వీర్‌సింగ్‌ సినిమా షూటింగ్స్‌లో పాల్గొనబోతున్నాడన్న వార్తలు మొదలయ్యాయి. ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే చిత్రబృందం ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని