close
Published : 13/04/2021 12:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రవితేజ కొత్త చిత్రం ప్రారంభం

ఇంటర్నెట్ డెస్క్‌: రవితేజ కథానాయకుడిగా శరత్‌ ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారు. దివ్యాంశ కౌశిక్‌ కథానాయిక. ఉగాది సందర్భంగా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి రవితేజ క్లాప్‌ కొట్టారు. నిర్మాత ‘మైత్రి’ రవి కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. ఈ నెలలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానున్నట్టు చిత్ర వర్గాలు తెలిపాయి. టైటిల్‌ని త్వరలోనే ప్రకటించనున్నారు. 

ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి శరత్‌ కథ, స్క్రీన్‌ ప్లే, మాటలు అందిస్తున్నారు. సంగీతం: సామ్‌ సీఎస్‌, కళ: సాహి సురేశ్‌, ఛాయాగ్రహణం: సత్యన్‌ సూర్యన్‌. ప్రస్తుతం ‘ఖిలాడి’ చిత్రంలో నటిస్తున్నారు రవితేజ. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని