RRR: క‌రోనాపై ‘ఆర్ఆర్ఆర్’ అవ‌గాహ‌న‌ - rrr about covid
close
Published : 08/06/2021 01:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

RRR: క‌రోనాపై ‘ఆర్ఆర్ఆర్’ అవ‌గాహ‌న‌

హైద‌రాబాద్‌: రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ద్వారా కొవిడ్ మహమ్మారిని ఎదుర్కోవచ్చని ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ ఏయూ శంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. సరైన ఆహారం, నిద్ర, వ్యాయామం, ప్రశాంతత... ఈ నాలుగు సూత్రాలే ప్రజలను రక్షిస్తాయని తెలిపారు. దర్శక దిగ్గజం రాజమౌళి కుటుంబానికి వ్యక్తిగత వైద్యులుగా ఉన్న శంకర్ ప్రసాద్... కొవిడ్ బారినపడిన ఆ కుటుంబానికి చికిత్స చేసి రక్షించారు. ఈ క్రమంలో కరోనా వైరస్పై నెలకొన్న అపోహలు, జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆర్ ఆర్‌ ఆర్ చిత్ర బృందం... డాక్టర్ శంకర్ ప్రసాద్ తో ప్రత్యేక చర్చను సాగించింది. సామాన్య ప్రజల్లో తలెత్తే సందేహాలను దర్శకుడు రాజమౌళి, కథానాయకులు ఎన్టీఆర్, రామ్ చరణ్, సంగీత దర్శకుడు కీరవాణి.. శంకర్ ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లారు. ఒక్కో ప్రశ్నకు వివరంగా సమాధాలిచ్చిన ఆయన... కరోనా వైరస్‌తో ప్రజలు సహజీవనం చేయకతప్పదని స్పష్టం చేశారు.

రాజ‌మౌళి: గ‌తేడాది వ‌ర‌కు ప్యాండ‌మిక్ (మహమ్మారి) అనే ప‌దం ఎవ‌రూ విన‌లేదు. దాని గురించి తెలీదు. ఎందుకు ఇవి సంభ‌విస్తాయి?

డాక్ట‌ర్‌: ప్యాండ‌మిక్‌ వ‌స్తూనే ఉంటుంది. కొవిడ్ ముందు 2009లో స్వైన్‌ఫ్లూ వ‌చ్చింది. భూమి, గాలి, నీరు.. వీటి ఉనికి దెబ్బ‌తిన్న‌ప్పుడు మ‌నం తినే ఆహారంలో సారం త‌గ్గిపోతుంది. దాని వ‌ల్ల న్యూట్రిషియ‌న్ స్థాయిలు త‌గ్గుతాయి. దాంతో అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. ప్ర‌కృతిలో మార్పు వ‌ల్ల మ‌నలోని వ్యాధి నిరోధ‌క శ‌క్తి త‌గ్గ‌టం, వైర‌స్ చొచ్చుకుపోయే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఇదే జ‌రుగుతుంది. దాంతో ప్యాండ‌మిక్స్‌ వ‌స్తాయి.

రాజ‌మౌళి: వ్యాక్సిన్ అనేది మందు కాదు. మ‌న‌లోని ఇమ్యూనిటీని పెంచుతుందంటున్నారు. మ‌రోవైపు మ‌న‌ ఇమ్యూనిటీని ట్రెయిన్‌ చేస్తుంది అంటున్నారు?

డాక్ట‌ర్‌: వ్యాక్సిన్ బ‌లం ఏంటంటే..  వైర‌స్‌ని బ‌లహీనం చేసేందుకు త‌ట్టుకునే సామ‌ర్థ్యాన్ని ఇమ్యూనిటీకి ఇస్తుంది. బ‌ల‌హీన‌త ఏంటంటే.. అది ప‌నిచేయాలంటే శ‌రీరంలో ఇమ్యూనిటీ స‌వ్యంగా ప‌నిచేస్తుండాలి. ఇమ్యూనిటీ సరిగా లేక‌పోతే వ్యాక్సిన్ ప‌నిచేయ‌దు. అందుకే బ్లడ్ క్యాన్స‌ర్‌, స్టెరాయిడ్ వాడుతున్న వారికి, ఎయిడ్స్ ఉన్న వారికి ఇలాంటి వ్యాక్సిన్ ఇవ్వ‌లేరు. ఇక్క‌డు రెండు అంశాలు గుర్తుంచుకోవాలి. ఒక‌టి.. ఇమ్యూనిటీ పెంచుకోవ‌డం. రెండోది.. ఇమ్యూనిటీ ట్రెయిన్  చేసుకోవ‌డం. వ్యాక్సిన్.. ఇమ్యూనిటీని ట్రెయిన్ చేయ‌గ‌లుగుతుంది. మ‌న శ‌రీర ఇమ్యూనిటీ సరిగా లేక‌పోతే ఏ వ్యాక్సిన్ ప‌నిచేయ‌దు. మ‌న ఇమ్యూనిటీపెంచుకోవాలంటే స‌రైన స‌మ‌యంలో, స‌రైన మోతాదులో, స‌రైన విధానంలో తినాలి, స‌మ‌యానికి ప‌డుకోవాలి, వ్యాయామం చేయాలి, పాజిటివ్ ఆలోచ‌న‌లతో ఉండాలి. ఇవి  మ‌రిచిపోయి వ్యాక్సిన్ వెన‌క ప‌రిగెత్తినంత మాత్రాన దీర్ఘ‌కాలిక ఉప‌శ‌మ‌నం ల‌భించ‌దు.

తార‌క్‌: మ‌న‌కి వైర‌స్ సోకిన‌పుడు ఇంక్యుబేష‌న్ పీరియ‌డ్ అంటాం?  ఎప్పుడైతే వైర‌స్ మ‌న శ‌రీరంలోకి ప్ర‌వేశించిందో ఆ రోజు నుంచి మెడిస‌న్ వాడాలి. మ‌నం ఫ‌స్ట్‌ గా దేన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలి?

డాక్ట‌ర్‌: మొద‌టి 7 రోజుల్లో వైరీమియా ఉంటుంది. ( అప్పుడు యాంటీ వైర‌ల్స్ ఇవ్వాలి). తర్వాత 7 రోజుల్లో యాంటీ ఇన్‌ఫ్ల‌మెట్రీ ప్రాధాన్య‌త వ‌హిస్తుంది. జ్వ‌రం వ‌చ్చిన‌పుడే ఫ‌స్ట్‌డే కాదు, ఆర్టీపీసీఆర్ చేయించుకున్న రోజే ఫ‌స్ట్ డే కాదు, టెస్ట్‌ పాజిటివ్‌ వ‌స్తే ఫ‌స్ట్ డే కాదు. మొట్ట మొద‌టిగా జ‌బ్బుకి సంబంధించి ల‌క్ష‌ణం ఏ రోజైతే బ‌యటప‌డుతుందో అదే ఫ‌స్ట్ డే.

తార‌క్‌: ఫంగ‌స్ గురించి చెప్తే బాగుంటుంది?

డాక్ట‌ర్‌: మ్యుకర్ మైక‌సిస్ అనేది ప్ర‌తి చోట ఉండే ఫంగ‌స్. ఏదైనా కూర‌గాయ‌ని కోసి అలానే ఉంచితే అక్క‌డ ఫంగ‌స్ చేరుతుంది. ఇది కొవిడ్ లాగా ఎక్క‌డో నుంచో వ‌చ్చేది కాదు.

రామ్ చరణ్:  చికిత్స‌కు ఆయుర్వేదం బెటరా.. అలోపతి బెటరా.. లేదంటే కాంబినేషనా?

డాక్ట‌ర్‌: మోడ్రన్ మెడిసిన్ ఒకలా చెప్తుంది. ఆయుర్వేదం ఒకలా చెప్తుంది. మనం కచ్చితంగా ఈ రెండింటిని కలపొచ్చు. ముఖ్యంగా రెండింటిపైనా అవగాహన ఉండాలి.

రామ్ చరణ్: కొవిడ్ సోకక ముందు, కొవిడ్ సోకినప్పుడు, కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

డాక్ట‌ర్‌: జ్వరం వచ్చినప్పుడు శరీరానికి అధిక మొత్తంలో కాల‌రీస్‌ కావాలి. మ‌న‌కి అంత శ‌క్తి రావాలి. వైర‌స్‌తో పోరాడాలంటే ప్రొటీన్ ఆహారం తీసుకోవాలి. ఒక సైన్సు ఎలా ఉన్నా తీసుకోమంటోంది. మ‌రో సైన్సు.. తీసుకోవ‌డం స‌రే అది అరుగుతుందో లేదో చూసుకోండి అని చెబుతుంది.

కీర‌వాణి: నాకు తెలిసిన కొంద‌రికి.. ఎంత జాగ్ర‌త్త‌గా ఉన్నా వైర‌స్ సోకింది? ఏ మూల నుంచి అది వ‌చ్చి ఉండొచ్చు?

డాక్ట‌ర్‌: ఇన్‌ఫెక్ష‌న్ ఉన్న వ్య‌క్తి మాట్లాడినా గాలిలో నుంచి వ‌స్తుంది. ఆ వ్య‌క్తి వాడిన వ‌స్తువులు వాడినా సోకుతుంది. దానిపై ప‌డిన తుంప‌ర్లే కార‌ణం. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని