‘పెప్సీ’భామ వచ్చేసింది! - seetimar special song pepsi aunty
close
Published : 21/03/2021 14:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘పెప్సీ’భామ వచ్చేసింది!

హైదరాబాద్: గోపీచంద్‌, తమన్నా జంటగా సంపత్‌నంది డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘సీటీమార్‌’. కబడ్డీ ఆట ప్రధానాంశంగా మాస్‌ అంశాలతో తెరకెక్కుతున్న కమర్షియల్‌ చిత్రం. ఇప్పటికే విడుదలైన ‘సీటీమార్‌’ టైటిల్‌సాంగ్‌ ఆకట్టుకుంది. తాజాగా విడుదలచేసిన స్పెషల్‌సాంగ్‌ ‘పెప్సీ ఆంటీ’ మాస్‌ ప్రేక్షకులను ఊర్రుతూలుగించడం ఖాయంగా కనిపిస్తోంది. అప్సరరాణి ఈ పాటలో యమ హుషారుగా నర్తించింది. ఈ సాంగ్‌ను కీర్తన శర్మ ఆలపించగా, మణిశర్మ స్వరపర్చారు. సంపత్‌నంది సాహిత్యం అందించటం విశేషం. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై చిట్టూరి శ్రీనివాసరావు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్‌ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఆ సాంగ్‌పై మీరు ఓ లుక్కేసుకోండి!Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని