‘వకీల్‌ సాబ్‌’లో శ్రుతి ఉందట.. కానీ! - shruti hasan playing a role in vakeel saab
close
Published : 20/07/2020 01:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘వకీల్‌ సాబ్‌’లో శ్రుతి ఉందట.. కానీ!

ఇంటర్నెట్‌ డెస్క్‌: పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. బాలీవుడ్‌లో హిట్‌ కొట్టిన ‘పింక్‌’ సినిమాకి ఇది రీమేక్‌. రాజకీయాల్లోకి వెళ్లి కొంతకాలం సినిమాలకు దూరమైన పవన్‌ ‘వకీల్‌ సాబ్‌’తో మళ్లీ వెండితెరపై సందడి చేయబోతున్నారు. మే నెలలోనే ఈ సినిమా విడుదల కావాల్సింది.. కానీ లాక్‌డౌన్‌తో వాయిదా పడింది. అయితే ఈ చిత్రం విశేషాలను చిత్రబృందం చాలా వరకు రహస్యంగా ఉంచుతోంది. అయినా ఒకటి రెండు సన్నివేశాలు లీకయ్యాయి. దీంతో ఈ సినిమాలో అంజలి కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఈ చిత్రంలో పవన్‌ తర్వాత కీలక పాత్రలో ఏ హీరోయిన్‌ నటిస్తుందన్న విషయంపై స్పష్టత లేదు. ఇప్పటికే తమన్నా, లావణ్య త్రిపాఠి, శ్రుతి హాసన్‌ పేర్లు వినిపించాయి. తాజాగా దీనిపై శ్రుతి హాసన్‌ స్పందించింది.

‘వకీల్‌ సాబ్‌’ చిత్రంలో తను ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు శ్రుతి హాసన్‌ వెల్లడించింది. తన పాత్రకు సంబంధించిన వివరాలు వెల్లడించడానికి మాత్రం ఆమె నిరాకరించింది. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్‌ ఉంది. శ్రుతి హాసన్‌ది ‘పింక్‌’ సినిమాలో తాప్సీ పోషించిన పాత్ర కాదట. ఈ సినిమాలో పవన్‌ కల్యాణ్‌కు భార్య పాత్రలో శ్రుతి హాసన్‌ కనిపించబోతున్నట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. పవన్‌ కల్యాణ్‌తో కలిసి శ్రుతి హాసన్‌ నటిస్తున్న మూడో చిత్రమిది. ఇది వరకు ‘గబ్బర్‌సింగ్‌’..‘కాటమరాయుడు’ చిత్రాల్లో ఇద్దరు కలిసి నటించారు. ‘వకీల్‌ సాబ్‌’ చిత్రం టీజర్‌ను పవన్‌ పుట్టిన రోజు సెప్టెంబర్‌ 2న విడుదల చేయనున్నట్లు సమాచారం. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని