Quarantine: 14 రోజులు గదిలో.. చాలా కష్టం: గిల్‌ - shubhman gill says being in room for 14 days quarentine is very hard
close
Published : 24/05/2021 22:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Quarantine: 14 రోజులు గదిలో.. చాలా కష్టం: గిల్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: విదేశాల్లో సెషన్‌ తర్వాత సెషన్‌ ఆడాలని, అదెంతో ముఖ్యమని టీమ్‌ఇండియా యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌గిల్‌ అన్నాడు. వచ్చేనెలలో జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో తలపడటానికి మించినది లేదన్నాడు. ప్రస్తుతం ముంబయిలో జట్టుతో కలిసి క్వారంటైన్‌లో ఉన్న గిల్‌ పలు విషయాలపై స్పందించాడు. ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు సిద్ధమవ్వడం బాగుందని చెప్పాడు.

‘ఆస్ట్రేలియా పర్యటనలో మేం బాగా ఆడాం. విదేశాల్లోనూ మంచి ప్రదర్శన చేస్తున్నాం. అలాగే ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు ఇంతకన్నా మెరుగ్గా సన్నద్ధమవ్వలేం. ఒక ఓపెనర్‌గా ఇంగ్లాండ్‌లోనే కాకుండా విదేశీ పర్యటనల్లో సెషన్‌ బై సెషన్‌ ఆడాలని అనుకుంటున్నా. అలా ఆడటం ఎంతో ముఖ్యం. ఇంగ్లాండ్‌లో వాతావరణం చల్లగా ఉంటే బంతి స్వింగ్ అవుతుంది. బ్యాటింగ్‌ చేయడం తేలికవుతుంది. ఒక ఓపెనర్‌గా అలాంటి పరిస్థితులను అర్థం చేసుకోవడం ఎంతో అవసరం’ అని గిల్‌ పేర్కొన్నాడు.

అలాగే కరోనా నిబంధనల గురించి మాట్లాడుతూ 14 రోజులు క్వారంటైన్‌లో ఉండటం చాలా కష్టమని, ఆ సమయంలో ఏ పనీ చేయలేమని యువ ఓపెనర్‌ చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా తమకు కొన్ని వర్కౌట్‌ కసరత్తులు సూచించారని, దాంతో అవి చేస్తున్నామని తెలిపాడు. అలాగే సినిమాలు చూస్తూ, పాటలు వింటూ రోజులు వెళ్లదీస్తున్నామన్నాడు. అయినా, అలా ఉండటం కష్టంగా ఉందన్నాడు. చివరగా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, రోహిత్‌తో మాట్లాడటంపై స్పందిస్తూ.. బ్యాటింగ్‌ చేసేటప్పుడు భయపడకుండా ఆడాలని కెప్టెన్‌ చెప్తాడన్నాడు. ఆ సమయంలో దేని గురించీ ఆలోచించకుండా ఉండాలని సలహాలిస్తాడు. ఇక హిట్‌మ్యాన్‌తో బ్యాటింగ్‌ చేసేటప్పుడు ప్రత్యర్థులు బంతులు ఎక్కడ వేస్తారు, పరిస్థితులు ఎలా ఉన్నాయనే విషయాలు చర్చించి అందుకు తగ్గట్టు ఆడేలా నిర్ణయాలు తీసుకుంటామన్నాడు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని