ప్రభుత్వ లాంఛనాలతో మిల్కాసింగ్‌ అంత్యక్రియలు - sprint legend milkha singh cremated with full state honours in chandigarh
close
Published : 19/06/2021 21:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రభుత్వ లాంఛనాలతో మిల్కాసింగ్‌ అంత్యక్రియలు

చండీగఢ్‌: స్ప్రింట్‌  దిగ్గజం మిల్కా సింగ్‌ అంత్యక్రియలను పంజాబ్‌ ప్రభుత్వం శనివారం అధికారిక లాంఛనాలతో నిర్వహించింది. కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు, పంజాబ్‌ గవర్నర్‌ వీపీ సింగ్‌ బండోరే, హరియాణా క్రీడా శాఖ మంత్రి సందీప్‌ సింగ్‌ తదితరులు అంత్యక్రియలకు హాజరయ్యారు. మిల్కాసింగ్‌ చితికి ఆయన కుమారుడు జీవ్‌ మిల్కాసంగ్‌ నిప్పంటించారు. మిల్కా సింగ్‌ మృతికి సంతాపంగా రాష్ట్రంలో ఒకరోజు సెలవు ప్రకటిస్తున్నట్లు పంజాబ్‌ ప్రభుత్వం వెల్లడించింది. పటియాలాలోని క్రీడా విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెడుతున్నట్లు పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ తెలిపారు.

మిల్కాసింగ్‌ నివాసానికి వెళ్లిన అమరీందర్‌ సింగ్‌.. 1960లో పాకిస్థాన్‌కు చెందిన అబ్దుల్‌ ఖాలిక్‌ను లాహోర్‌లో ఓడించిన సందర్భంగా దేశవ్యాప్త సెలవు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ విజయం తర్వాతే పాకిస్థాన్‌ అధ్యక్షుడు జనరల్‌ అయూబ్‌ ఖాన్‌ మిల్కా సింగ్‌ను ‘ఫ్లయింగ్‌ సిక్‌’ అనే పేరుతో సంభోదించారు. గత నెల కరోనా బారిన పడ్డ మిల్కాసింగ్‌.. అనంతరం పలు అనారోగ్య కారణాలతో శుక్రవారం తుది శ్వాస విడిచారు. ఆయన భార్య నిర్మల్‌ కౌర్‌ కూడా ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని