‘శ్రీకారం’ లాంటి కథలు మళ్లీ రావు: శర్వానంద్‌ - sreekaram movie press meet
close
Published : 07/03/2021 05:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘శ్రీకారం’ లాంటి కథలు మళ్లీ రావు: శర్వానంద్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న కథానాయకుడు శర్వానంద్‌. వ్యవసాయం ఇతివృత్తంగా ‘శ్రీకారం’తో మరోసారి అలరించేందుకు సిద్ధమయ్యాడు. నూతన దర్శకుడు కిషోర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రియాంక్ అరుళ్‌ మోహన్‌ కథానాయిక. 14రీల్స్‌ పతాకంపై రామ్‌ అచంట, గోపీ అచంట నిర్మించారు. మిక్కీ జె.మేయర్‌ సంగీతం అందించారు. మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రబృందం శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.

ఈ సందర్భంగా శర్వానంద్‌ మాట్లాడారు.. ‘కథ వినగానే ఈ సినిమా చేయడం నా బాధ్యత అనిపించింది. ఎందుకంటే ఇలాంటి కథలు మళ్లీమళ్లీ రావు. పండించేవాళ్లు తక్కువైపోతున్నారు.. తినేవాళ్లు ఎక్కువైపోతున్నారు. రైతులు పండిస్తేగానీ మనం తినలేం. ఇంత మంచి కథ ఎంచుకున్న కిషోర్‌కు హ్యాట్సాఫ్‌ చెప్పాలి. ఈ కథ వినడానికి నాకు కుదరకపోయినా.. నాకోసం చాలారోజులు ఎదురుచూసి మరీ కథ చెప్పారు. ఇంతమంచి డైలాగ్స్‌ రాసిన సాయిమాధవ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. నాలుగు ఫైట్లు, నాలుగు పాటలు పెట్టి కమర్షియల్‌ సినిమాలు చేయడం చాలా సులభం. కానీ.. ఇలాంటి సినిమాను నమ్మడం నిర్మాతల గొప్పతనం. ప్రేక్షకులకు ఒక మంచి సినిమా ఇవ్వబోతున్నాం. ట్రైలర్‌ చూడగానే చరణ్‌ ఫోన్‌ చేశాడు. ఇలాంటి సినిమాలకు మద్దతివ్వాలన్న ఉద్దేశంతోనే కేటీఆర్‌గారు, చిరంజీవి గారు స్పందించారు. మార్చి 8న జరిగే ప్రిరిలీజ్‌ వేడుకకు వస్తామని మాటిచ్చారు. వాళ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు’ అని శర్వానంద్ చెప్పారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని