Jai Bhim: ప్రతి జాతిలోనూ దొంగలున్నారు.. సూర్య ‘జై భీమ్‌’ టీజర్‌ చూశారా? - suriya jai bhim telugu teaser out
close
Published : 16/10/2021 02:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Jai Bhim: ప్రతి జాతిలోనూ దొంగలున్నారు.. సూర్య ‘జై భీమ్‌’ టీజర్‌ చూశారా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమిళంతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్‌ సొంతం చేసుకున్న కథానాయకుడు సూర్య. ఆయన నటించిన ప్రతి తమిళ చిత్రం తెలుగులోనూ విడుదలవుతుంది. టి.జె.జ్ఞానవేల్‌ దర్శకత్వంలో సూర్య నటించిన లీగల్‌ డ్రామా మూవీ ‘జై భీమ్’. ప్రకాశ్‌రాజ్‌, రావు రమేశ్‌ కీలక పాత్రలు పోషించారు. దసరా సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో సూర్య లాయర్‌ పాత్రలో కనిపించారు. ఒక మహిళకు జరిగిన అన్యాయంపై చంద్రు అనే లాయర్‌ ఎలా పోరాటం చేశాడు? ఈ క్రమంలో ఆయనకు ఎదురైన అనుభవాలు ఏంటి? వాటిని ఎలా ఎదుర్కొని ఆ మహిళకు న్యాయం చేశాడన్నది చిత్ర కథ. ‘బాధింపబడని వారికి లభించని న్యాయం. వాళ్లకు జరిగిన అన్యాయం కంటే దారుణంగా ఉంటుంది’, ‘దొంగలకు కూడా ఒక జాతి ఉంటుందా? నటరాజ్‌. నీ జాతిలోనూ, నా జాతిలోనూ అందరి జాతుల్లోనూ పెద్ద పెద్ద దొంగలు ఉంటారు’ వంటి సంభాషణలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.

ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా దీపావళి కానుకగా నవంబరు 2న అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘‘న్యాయం కోసం ధైర్యంగా ,విశ్వాసంగా పోరాడే కథ ఇది.. మీ ముందుకు ఈ చిత్రం తీసుకొస్తున్నందుకు గర్వంగా ఉంది. నవంబరు2న ఈ చిత్రం అమెజాన్‌ ఓటీటీ వేదికగా విడుదల కానుంది’’ అని సూర్య ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని