వంటింట్లో వీటితో జాగ్రత్త..! - take care of with these products in kitchen
close
Updated : 10/07/2021 13:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వంటింట్లో వీటితో జాగ్రత్త..!

సుమ ఓ మధ్య తరగతి గృహిణి.. ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటుంది. అయితే ఈ మధ్యే వంటచేస్తూ ఉండగా మధ్యలో స్టౌ కిందకు ఓ బొద్దింక రావడంతో దాన్ని చంపాలని బొద్దింకలను చంపే ఓ స్ప్రేను కొట్టింది. దాంతో బొద్దింక చావడం సంగతి పక్కన పెడితే.. ఆ స్ప్రే నుంచి వచ్చిన రసాయనానికి స్టౌ మంట తోడై గదిలో మంటలు అంటుకున్నాయి.. సమయానికి స్పందించి మంటలు ఆర్పడంతో పెద్ద ప్రమాదం తప్పింది.. కేవలం ఇలాంటి స్ప్రేలు మాత్రమే కాదు.. రోజూ మనం వంటింట్లో ఉపయోగించే ఎన్నో వస్తువులు మంటలను వ్యాపింపజేసే గుణాన్ని కలిగి ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం రండి..

ఏరోసాల్ స్ప్రేలు..

ఏరోసాల్ స్ప్రేలలో రసాయన ద్రావణాన్ని, గాలితో కలిపి టిన్లలో నింపి ఉంచుతారు. వీటిలోపల గాలి ఉండడంతో పీడనం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వస్తువులకు మంట తగిలితే అందులోని పీడనం వల్ల అవి పేలిపోవడం, ఆ రసాయనాలు మంటలను వ్యాపింపజేయడం జరుగుతాయి. అందుకే క్రిమికీటకాలను చంపే కీటకనాశిని స్ప్రేలతో పాటు పెర్ఫ్యూమ్ బాటిళ్లను కూడా మంటలకు దూరంగా ఉంచడం మంచిది. అలాగే క్రిమికీటకాలను దూరంగా ఉంచేందుకు ఉపయోగించే నాఫ్తలీన్‌ బాల్స్‌ వంటివి కూడా మంటలను వ్యాపింపజేస్తాయి. కాబట్టి వాటిని కిచెన్‌లో ఉపయోగించకపోవడం మంచిది.

నెయిల్ పాలిష్

నెయిల్ పాలిష్‌లో Toluene, Formaldehyde, Dibutyl Phthalate వంటి రసాయనాలుంటాయి. ఇక నెయిల్ పాలిష్ రిమూవర్‌లోనూ ఎసిటోన్ అనే రసాయనం ఉంటుంది. ఇవన్నీ మంటలు అంటుకునే స్వభావం కలిగిన రసాయనాలే.. అందుకే వీటిని కూడా మంటలకు దగ్గరగా, కిచెన్‌లో అస్సలు ఉపయోగించకూడదు. వీటితో పాటు హెయిర్ స్ప్రే, లిప్‌జెల్ లాంటి వాటిని కూడా మంటలకు దూరంగా ఉంచాలి.

శానిటైజర్
కరోనా వల్ల ప్రస్తుతం శానిటైజర్‌ ఉపయోగించడం కామనైపోయింది. అయితే దీన్ని చేతులకు రుద్దుకొని స్టౌ వెలిగించడం, మంటకు దగ్గరగా వెళ్లడం వల్ల మంటలు అంటుకునే ప్రమాదం ఉంది. ఇందులోని ఆల్కహాల్‌కు మంటల్ని వాపింపజేసే స్వభావం ఉండడమే దీనికి కారణం. అలాగే వంటింట్లో పనులు చేసేటప్పుడు శానిటైజర్‌కి బదులుగా శుభ్రంగా సబ్బునీటితో చేతులు కడుక్కోవడం ఉత్తమం. అలాగే శానిటైజర్‌ బాటిల్‌ని సైతం కిచెన్‌లో ఉంచకపోవడమే మంచిది. అలాగే బ్లీచ్‌, స్టెయిన్‌ రిమూవర్‌.. వంటి లాండ్రీ ఉత్పత్తులు కూడా వంటింట్లో ఉంచకూడదు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని