Tollywood: సినిమా టికెట్ల ధరలపై ఏ నిర్ణయం తీసుకున్నారు: హైకోర్టు - telangana high court asks government give the rules and regulations for movie tickets
close
Published : 27/07/2021 17:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tollywood: సినిమా టికెట్ల ధరలపై ఏ నిర్ణయం తీసుకున్నారు: హైకోర్టు

హైదరాబాద్‌: సినిమా టికెట్ల ధరలు ఖరారు చేసేందుకు నిబంధనల రూపకల్పనపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. సినీ ప్రేక్షక వినియోగదారుల సంఘం ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. గతంలో హైకోర్టు తీర్పునకు అనుగుణంగా, చట్టప్రకారం టికెట్ల ధరలను ఖరారు చేయడం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది జీఎల్ నర్సింహారావు వాదించారు. టికెట్ల ధరల ఖరారు కోసం ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక సమర్పించిందని ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు. కమిటీ సూచనలు, సిఫార్సులపై ఏం నిర్ణయాలు తీసుకున్నారని హైకోర్టు ప్రశ్నించింది. పూర్తి వివరాలతో నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని