Anand Devarakonda: ‘హైవే’.. ప్రయాణం సంపూర్ణం - telugu news Anand Devarakonda Starer Highway Shooting Completed
close
Updated : 10/10/2021 09:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Anand Devarakonda: ‘హైవే’.. ప్రయాణం సంపూర్ణం

ఆనంద్‌ దేవరకొండ హీరోగా కేవీ గుహన్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘హైవే’. వెంకట్‌ తలారి నిర్మాత. మానస రాధాకృష్ణన్‌ కథానాయిక. సైమన్‌ కె.కింగ్‌ స్వరాలందిస్తున్నారు. విభిన్నమైన సైకో క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ తాజాగా పూర్తయింది. ఈ విషయాన్ని చిత్ర బృందం సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేసింది. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ప్రతి క్షణం ఆసక్తికర ట్విస్ట్‌లు, టర్న్‌లతో సాగే చిత్రమిది. టెక్నికల్‌గా ఉన్నతంగా ఉంటుంది. చిత్రీకరణ పూర్తయింది. త్వరలో మరిన్ని వివరాలతో మీ ముందుకొస్తాం’’ అన్నారు. ‘‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల్లో చిత్రీకరణ జరిపాం. దీంట్లో కొందరు ప్రముఖ నటీనటులు పని చేశారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి’’ అన్నారు చిత్ర నిర్మాత.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని