Cinema News: ఓ యువతి ప్రతీకారం - telugu news Street Light Release On November 12
close
Updated : 22/10/2021 07:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cinema News: ఓ యువతి ప్రతీకారం

తాన్య దేశాయ్‌, అంకిత్‌రాజ్‌, కావ్య రెడ్డి, సీనియర్‌ హీరో వినోద్‌  కుమార్‌ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘స్ట్రీట్‌ లైట్‌’. విశ్వ దర్శకత్వం వహించారు. మామిడాల శ్రీనివాస్‌ నిర్మాత. ఈ చిత్రాన్ని నవంబర్‌ 12న తెలుగు, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఒక యువతి ప్రతీకార కథ ఇది. ఆమెకి జరిగిన అన్యాయం ఎలాంటిది? ఎవరిపై ప్రతీకారం తీర్చుకుందనేది ఆసక్తికరం. ఒక రాత్రి వీధి దీపాల కింద కనిపించిన విభిన్న వ్యక్తుల వింత పోకడల్ని తెరపై ఆవిష్కరించిన విధానం ఆలోచన రేకెత్తిస్తుంది. నేర నేపథాన్ని, వాస్తవికతను ఆవిష్కరించే ఈ చిత్రం ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తుంది’’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘మంచి సందేశం ఉన్న కథ ఇది. ఇంటిల్లిపాదీ కలిసి చూసే అంశాలున్నాయి’’ అన్నారు. చిత్రం శ్రీను, ధన్‌రాజ్‌, షకలక శంకర్‌, ఈశ్వర్‌, కావ్యరెడ్డి, వైభవ్‌, కొండా బాబు, సాయికీర్తన   తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: విరించి, ఛాయాగ్రహణం: రవి.సి కుమార్‌.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని