Akhil: మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వచ్చేస్తున్నాడు - telugu news akhil most eligible bachelor release date announcement
close
Published : 28/08/2021 14:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Akhil: మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వచ్చేస్తున్నాడు

హైదరాబాద్‌: అఖిల్‌ అక్కినేని కథానాయకుడిగా రానున్న యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’. పూజాహెగ్డే కథానాయిక. కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల రీత్యా ఈ సినిమా ఎప్పుడు విడుదల కానుందనే విషయంలో కొంతకాలం నుంచి సందిగ్ధత నెలకొంది. థియేటర్లలోనా? ఓటీటీలోనా? అన్న చర్చలు కూడా సాగాయి. ఆ చర్చలన్నింటికీ చిత్రబృందం శనివారం తెరదించింది. అక్టోబర్‌ 8న థియేటర్లలోనే సినిమాని విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటనతో నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘మిస్టర్‌ మజ్ను’ తర్వాత అఖిల్‌ నటిస్తున్న చిత్రమిది. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వం వహించారు. జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. గోపీసుందర్‌ స్వరాలు అందించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి.




Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని