Toofaan: పాత్ర కోసం ఫర్హాన్‌ ఇంత కష్ట పడ్డాడా! - telugu news bollywood actor farhan akhtar body transformation in toofaan movie
close
Updated : 20/07/2021 18:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Toofaan: పాత్ర కోసం ఫర్హాన్‌ ఇంత కష్ట పడ్డాడా!

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొన్ని పాత్రలు నటులకు సవాలు విసురుతాయి. మానసికంగా మాత్రమే కాదు శారీరకంగానూ సత్తా చూపించాలంటాయి. ఎక్కువగా క్రీడా నేపథ్యంలో సాగే సినిమాల్లోని పాత్రలు ఈ జాబితాలోకి వస్తాయి. ఓ నటుడు క్రికెటర్‌లా కనిపించాలంటే బ్యాట్‌ పట్టుకుంటే సరిపోదు. అందుకు తగిన శ్రమ పడాల్సిందే. బాక్సర్‌ పాత్ర అయితే అది మరింత కష్టంతో కూడుకున్న వ్యవహారం. బాక్సింగ్‌ టెక్నిక్స్‌తోపాటు దేహ దారుఢ్యాన్ని పూర్తిగా మార్చుకోవాలి. అప్పుడే తెరపై ఆ పాత్రని చూస్తున్న ప్రేక్షకులకి మంచి అనుభూతి కలుగుతుంది. అయితే ఇది మాటల్లో చెప్పినంత తేలిక కాదు. రాత్రీపగలూ ఎన్నో కసరత్తులు చేయాలి. ఈ క్రమంలో ‘ఇది నేను చేయలేను’ అనే పరిస్థితి ఎదురవుతుంది. బాలీవుడ్‌ నటుడు ఫర్హాన్‌ అక్తర్‌ విషయంలో ఇదే జరిగింది.

బాక్సర్‌గా ఆయన నటించిన చిత్రం ‘తుఫాన్‌’. రాకేశ్‌ ఓం ప్రకాశ్‌ మెహ్రా దర్శకుడు. మృణాళ్‌ ఠాకూర్‌ నాయిక. ఇటీవల ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా విడుదలై ప్రేక్షకుల్ని అలరిస్తోంది. సినిమా, ట్రైలర్‌ చూసిన వాళ్లంతా ఫర్హాన్‌ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్‌ (శారీరక మార్పు) గురించే మాట్లాడుకున్నారు. అదెలా సాధ్యమైందో ఓ వీడియో రూపొందించి, తాజాగా విడుదల చేసింది అమెజాన్‌ ప్రైమ్‌. బాక్సర్‌ పాత్ర కోసం మూడు నెలలు కష్టపడ్డాడు ఫర్హాన్‌. సినిమా ప్రారంభానికి ముందు 85 కేజీల బరువు ఉన్న ఆయన ట్రైనర్‌ సలహాలు సూచనలతో ఫిట్‌గా మారారు. 200-300 కిలోల బరువుని ఎత్తుతూ.. ఒకానొక దశలో ‘నా వల్ల కావట్లేదు’ అంటూ కింద పడిపోయారు. అయినా తనని తాను నిరూపించుకునేందుకు ఇదే సరైన అవకాశం అని భావించి చివరకి అనుకున్న లక్ష్యం ఛేదించారు. దర్శకనిర్మాతల్నీ ఆశ్చర్యంలో పడేశారు. ఈ వీడియో చూశాక మీరూ అంటారు.. పాత్ర కోసం ఫర్హాన్‌ ఇంత కష్ట పడ్డాడా! అని.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని