Cash Promo: సుమ.. నువ్వు నన్ను గెలవనిస్తావా?: బాబుమోహన్‌ - telugu news cash programme latest promo
close
Published : 25/07/2021 17:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cash Promo: సుమ.. నువ్వు నన్ను గెలవనిస్తావా?: బాబుమోహన్‌

హైదరాబాద్‌: బుల్లితెర లేడీ సూపర్‌స్టార్‌ సుమ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతున్న ఎంటర్‌టైన్‌మెంట్‌ గేమ్‌ షో ‘క్యాష్‌ దొరికినంత దోచుకో’. తాజాగా ఈ షోలో అలనాటి సినీ తారలు బాబుమోహన్‌, గౌతమ్‌ రాజు, రాజ్యలక్ష్మి, శివపార్వతి సందడి చేశారు.

మొదటిసారిగా ‘క్యాష్‌’ షోలో పాల్గొన్న బాబుమోహన్‌.. ‘ప్రోగ్రామ్‌ గెలిచిన తర్వాత క్యాష్‌ తీసుకువెళ్లాలి కదా.. కానీ నేను బ్యాగ్‌లు తీసుకురావడం మర్చిపోయాను’ అని అనగానే.. ‘అంటే ఈ ఎపిసోడ్‌ మీరే గెలుస్తారనే గట్టి నమ్మకంతో వచ్చారా!’ అంటూ సుమ కామెంట్‌ చేశారు. దాంతో బాబుమోహన్‌.. ‘అస్సలు నువ్వు.. నన్ను గెలవనిస్తావా?’ అని సరదాగా అన్నారు. అనంతరం నటి రాజ్యలక్ష్మి.. ‘సుమ నాకు నిన్ను చూస్తుంటే అసూయగా ఉంది. ఎందుకంటే మేము చిన్న వయసులో ఉన్నప్పుడు మాత్రమే లంగావోణీలు వేసుకున్నాం. కానీ నువ్వు ఇప్పటికీ లంగావోణీలు వేసుకుంటున్నావ్‌’ అని అనగానే.. ‘అంటే మీ మాటకు అర్థమేమిటి? పెద్దవయసు వచ్చినా నేనింకా లంగావోణీలు వేసుకుంటున్నాననా?’ అని నవ్వులు పూయించారు. ఎవర్‌గ్రీన్‌స్టార్స్‌తో ఎంతో సరదాగా సాగిన ఈ ఎపిసోడ్‌ వచ్చే శనివారం ప్రసారం కానుంది. జులై 31న ప్రసారం కానున్న ‘క్యాష్‌’ ప్రోగ్రామ్‌ ప్రోమో చూసేయండి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని