Cinema news: మీ అభిమాన థియేటర్లలో.. ‘ఇష్క్‌’, ‘తిమ్మరుసు’ - telugu news ishq and timmarusu movie will release in theaters
close
Published : 23/07/2021 20:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cinema news: మీ అభిమాన థియేటర్లలో.. ‘ఇష్క్‌’, ‘తిమ్మరుసు’

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘నేడే చూడండి.. మీ అభిమాన థియేటర్లలో’.. ఈ మాట వినిపించక చాలా కాలమైంది. కరోనా ఫస్ట్‌వేవ్‌ ముగిశాక ఈ ఏడాది సంక్రాంతికి థియేటర్లలో సందడి మొదలైందనుకునేలోగా సెకండ్‌ వేవ్‌ ప్రత్యక్షమైంది. థియేటర్లని మళ్లీ మూసేసింది. ప్రస్తుతం పరిస్థితులు కాస్త చక్కబడటంతో థియేటర్లు తెరచుకోనున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం అనుమతినివ్వడంతో జులై 30 నుంచి సినిమాల సందడి మొదలవబోతుంది. ఇదే రోజున ప్రేక్షకుల ముందుకు రానున్నాయి ‘ఇష్క్‌’, ‘తిమ్మరుసు’ చిత్రాలు.

తేజ సజ్జ, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ జంటగా నటించిన చిత్రం ‘ఇష్క్‌’. నాట్‌ ఏ లవ్ స్టోరీ అనేది ఉపశీర్షిక. ఈ సినిమాకి ఎస్‌.ఎస్‌. రాజు దర్శకత్వం వహించారు. ఆర్‌.బి. చౌదరి సమర్ఫణలో ఎన్‌.వి.ప్రసాద్‌, పరాస్‌ జైన్‌, వాకాడ అంజన్‌ కుమార్‌ నిర్మించారు. మహతి స్వర సాగర్‌ సంగీతం అందించారు. సత్యదేవ్‌, ప్రియాంక జవాల్కర్‌ ప్రధాన పాత్రల్లో శరణ్‌ కొప్పిశెట్టి రూపొందించిన చిత్రం ‘తిమ్మరుసు’. మహేశ్ కోనేరు నిర్మించారు. శ్రీ చరణ్‌ పాకాల స్వరాలు సమకూర్చారు. ఎప్పటికైనా సరే తమ చిత్రాల్ని వెండితెరపైనే ప్రేక్షకుల్ని చూపించాలని నిర్ణయించుకున్న ఈ రెండు చిత్ర బృందాలు ప్రస్తుతం ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాయి. ఈ మేరకు కొన్ని ఫొటోలు పంచుకున్నాడు సత్యదేవ్‌. ‘జులై 30న వస్తున్నాం, మీ అభిమాన థియేటర్లలో’ అంటూ ఓ ఆసక్తికర వీడియోను పంచుకున్నాడు తేజ. ‘ఇష్క్‌’ విశేషాలెంటో మీరూ చూసేయండి...




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని